యురేనియం..జీవ వైవిధ్యం..వినాశనం..!
పదవులను అంటిపెట్టుకున్న పాలకులు పలకడం లేదు. మానవ జాతికి జీవనాధారమైన పచ్చని నల్లమల అటవీ ప్రాంతం, ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని తరాలుగా, కొన్నేళ్లుగా ఈ మట్టినే నమ్ముకుని బతుకుతున్న, అడవి బిడ్డలు అడవితో శ్శాశ్వతంగా బంధాన్ని కోల్పోనున్నారు. తన భూభాగంలో ప్రవహించే కృష్ణా నది కాలుష్యపు కోరల్లో చిక్కుకోనుంది. అంతేనా తెలంగాణకే కాదు భారత దేశానికి తలమానికంగా నిలిచే జంతు జీవాలు, పులులు ఇక అంతరించి పోనున్నాయి. ఓ వైపు ఇంతటి విధ్వంసానికి శ్రీకారం చుట్ట బోతున్నది కేంద్రంలో కొలువు తీరిన ప్రభుత్వం. దీని వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుందని తెలిసినా పాలకులు , రాష్ట్ర సర్కార్ నిమ్మకుండి పోయారు.
ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చెందిన డీబీర్స్ కంపెనీ ఈ నల్లమలపై కన్నేసి, అడవి బిడ్డల పోరాటానికి తలవంచింది. వజ్రాల వెలికితీత పేరుతో నల్లమలలోకి పూర్తిగా అడుగు పెట్టకుండానే , ప్రజల పోరాటంతో , ఆందోళనలతో దెబ్బకు విరమించుకుంది. తాజాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇప్పటికే అనుమతులు ఇచ్చేసింది. యురేనియం తవ్వకాల వల్ల నల్లమల పూర్తిగా పాడై పోతుంది. కనీసం 4 వేలకు పైగా బోర్లు వేయనున్నారు. దీంతో మొత్తం అటవీ ప్రాంతం ధ్వంసమవుతుంది. దీనికి అటవీ శాఖ ఒప్పుకోవాల్సి ఉంది. నల్లమలలో అందాలు మాయమవుతాయి.
అడవి బిడ్డలు పూర్తిగా జీవనాధారం కోల్పోతారు. తాగు నీరు, సాగు నీరు పూర్తిగా కాలుష్యానికి లోనవుతుంది. క్యాన్సర్, లాంటి ప్రమాదకర వ్యాధులకు గురవుతారు. మొత్తం మీద యురేనియం దెబ్బకు నల్లమల కనుమరుగయ్యే ప్రమాదానికి లోనవుతుంది. సర్వేకు సైతం అనుమతి ఇవ్వాలన్నా అటవీ శాఖ పర్మిషన్ కావాల్సి ఉంటుంది. ఇదే సమయంలో నల్లమల బిడ్డలు అడవిని విడిచి ఉండలేమంటున్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆందోళన చేపట్టాయి. ఓ వైపు హరిత హారం చేపట్టామని కోరుతున్న ప్రభుత్వం, ఈ నల్లమలపై నోరు మెదపడం లేదు. రాబోయే రోజుల్లో నల్లమల కలగా మారబోతున్నదా అనే అనుమానం కలుగుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి