అనిల్ కు పుత్రోత్సాహం

ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడికి కొత్త ఏడాది కలిసి వచ్చినట్టుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా తీసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ ప్రిన్స్ తో తీసిన సినిమా సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కు రెడీ అయ్యింది. సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్స్ కు భారీ ఆదరణ లభించింది. కాగా డైరెక్టర్ అనిల్ కు కుమారుడు పుట్టాడు. ఇది వరకు రావిపూడి.. పటాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2 లాంటి హిట్‌ సినిమాలను అందించాడు. అతని సినిమా వస్తుందంటే చాలు ఒక్కసారైనా చూడాల్సిందే అనుకునే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఓటమి చవి చూడని దర్శకుడిగా అనిల్‌ రావిపూడికి టాలీవుడ్‌లో ముద్ర పడి పోయింది. వినూత్న కామెడీతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించే శక్తి అనిల్‌ రావిపూడి సొంతం.

గతేడాది ఎఫ్‌2తో బాక్సాఫీస్‌ దగ్గర నవ్వులు కురిపించన అనిల్‌ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాకు పని చేస్తున్నారు. అనిల్‌ రావిపూడికి కొడుకు పుట్టడంతో కుటుంబంలో సంతోషం నెలకొంది. దీంతో అనిల్‌ ఇంట్లో సంక్రాంతి పండగ ముందుగానే వచ్చినట్టయింది. కాగా అనిల్‌, భావనల జంటకు శ్రేయాస్వి అనే కూతురు ఉంది. కూతురుతో ఆడుకోడానికి మరో బుడతడు వచ్చేయడంతో ఆ ఇంట్లో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అనిల్‌ రావిపూడికి అభినందనలు తెలిపాడు.

పలువురు సినీప్రముఖులు అనిల్‌కు కంగ్రాట్స్‌ తెలియ జేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్‌ను మాస్‌ యాంగిల్స్‌లో చూస్తారని, అభిమానులు తప్పకుండా ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశాడు ఈ డైరెక్టర్. అయితే ఈ చిత్రంలో మాస్‌తో పాటు కావాల్సినంత కామెడీ కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. మూవీలో మహేశ్‌ సరసన రష్మిక మందన్నా నటించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!