తొలగని ప్రతిష్టంభన..తప్పని నిరీక్షణ


మహారాష్ట్రలో రాజకీయాలు మరింత వేడెక్కిస్తున్నాయి. బీజేపీ, శివసేన పార్టీలు ఎవరికి వారే ఎమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తూ ఉండడంతో ప్రభుత్వం ఏర్పాటులో ఆలశ్యం అవుతోంది. ఇరు పక్షాలు మెట్టు దిగడం లేదు. సీఎం కుర్చీ కోసం పట్టు వీడడం లేదు. దీంతో ట్రబుల్ షూటర్, హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి పదవి ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని తేల్చి చెప్పారు. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అంతా సర్దుకుంటుందని, త్వరలోనే ఇరు పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఫడ్నవీస్ చెప్పారు. అంతకు ముందు శాసన సభా పక్ష నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ మరోసారి ఎన్నికయ్యారు.

పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్, పార్టీ ఉపాధ్యక్షుడు అవినాష్‌ రాయ్‌ ఖన్నాల సమక్షంలో అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 105 మంది ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా ఫడ్నవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకం ఉంచిన ఎమ్మెల్యేలకు ఫడ్నవీస్‌ కృతజ్ఞతలు తెలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో వచ్చిన ప్రత్యామ్నాయాలన్నింటినీ దేవేంద్ర ఫడ్నవీస్‌ ఒక్క వ్యాఖ్యతో తోసిపుచ్చారు. బీజేపీ–శివసేన కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

వార్తలన్నీ ఊహా గానాలేనని, కేవలం వినోదం కోసమే వాటిని ప్రచారం చేశారని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు బీజేపీ, శివసేన కూటమికే ఓట్లు వేశారు. పూర్తి స్థాయి మెజార్టీని అప్పగించారు. అందుకే ఆ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని స్పష్టం చేశారు. కాగా  ఎన్నికల్లో 56 స్థానాలు గెలిచిన శివసేన ఆరుగురు స్వతంత్రుల మద్దతుతో బలాన్ని 62కు పెంచుకుంది. తమ గౌరవానికి భంగం కలగకుండా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం శివసేనకు అవసరమని ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ చెప్పారు. 

కామెంట్‌లు