ఆర్ధిక పరిస్థితిపై ఆందోళన
దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన గతంలో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలాగే వుంటే గనుక బతకడం కష్టమవుతుందని హెచ్చరించారు. మరోసారి ప్రపంచం మెచ్చిన ఈ ఆర్థికవేత్త, మేధావి రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం ప్రస్తుతం తీవ్ర సంక్షోభం దిశగా పయనిస్తోందని హెచ్చరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కోనున్నాయని హెచ్చరించారు. ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి చేరిన విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగిత రేటు తీవ్ర స్థాయిలో ఉందని తెలిపారు. రియల్టీ, కన్‌స్ట్రక్షన్, మాన్యుఫాక్చర్ కంపెనీలకు పెద్ద మొత్తంలో రుణాలిచ్చే ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యతను పరిశీలించాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర బ్యాంకు టాప్ 50 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పనితీరును సమీక్షిస్తుందన్న ఆయన ఆర్‌బీఐ వాటి పనితీరును, వాటి ఎసెట్ క్వాలిటీని కూడా సమీక్షించాలని సూచించారు. కాగా షాడో బ్యాంకింగ్ రంగంలో మొత్తం ఆస్తులలో 75 శాతం వాటా ఉన్న టాప్ 50 నాన్ బ్యాంక్ ఫైనాన్షియర్లను సెంట్రల్ బ్యాంక్ నిశితంగా పరిశీలిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
అలాగే అతి ముఖ్యమైన పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు కుప్పకూలకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని ఆయన పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. కాగా నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. యూఎస్‌డీ 66 బిలియన్ల మేర బకాయిలు ఉన్నటు ఇటీవల ఓ సర్వే తెలియజేసిందని వెల్లడించారు మరోవైపు ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ స్పందిస్తూ సుమారు 4.54 లక్షల యూనిట్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి కావడం లేదని పేర్కొంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి