రసవత్తరం ..కర్ణాటకం ..వేడెక్కిన రాజకీయం
కర్ణాటకలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా తమ ప్రతాపం చూపించాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్టుదలతో ఉంది. గతంలో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరి వరకు అధికారాన్ని చేజిక్కించుకునే దశలో బోల్తా పడింది. రాజకీయ రంగంలో అపర చాణుక్యులుగా పేరొందిన దేవగౌడ, చంద్రబాబు నాయుడులు ఈసారి మిత్రపక్షాలుగా రంగంలోకి దిగారు. ఏపీలో ఎన్నికలు ముగియడంతో దేశవ్యాప్తంగా ఆయా భావసారూప్యత కలిగిన పార్టీలకు మద్ధతుగా బాబు, గౌడలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మద్ధతుతో పవర్‌లో కొనసాగుతున్న గౌడ పరివారం మరోసారి తమ సత్తా చాటేందుకు యత్నిస్తోంది. పార్లమెంట్ స్థానాలను పూర్తిగా మిత్రపక్షం గెలవాలనే పట్టుదలతో పర్యటించారు.
వీరికి మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ దేశాధ్యక్షుడు రాహుల్ గాంధీ విస్తృతంగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. రాయిచూర్‌లో జరిగిన సభలో దేవగౌడ, చంద్రబాబు, రాహుల్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరంతా బీజేపీ సర్కార్‌పై..మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్డీఏ సర్కార్ ఓడిపోతేనే దేశం, రాష్ట్రాలు ప్రగతి పథంలో నడుస్తాయని వారన్నారు. తెలుగు వారు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. 2014లో మోదీకి బంపర్ మెజారిటీ ఇచ్చారు..కానీ ప్రజలకు సేవలందించాల్సిన మోదీ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారని..ఆర్థిక నేరగాళ్లకు వత్తాసు పలికారంటూ రాహుల్ ధ్వజమెత్తారు. నోట్ల రద్దుతో ఆర్థికాభివృద్ధి రెండు శాతం తగ్గిందని..50 లక్షల ఉద్యోగాలు ఊడి పోయాయని ఈ విషయాన్ని విప్రో సంస్థ తేల్చిందన్నారు. బీజేపీ పాలన తుగ్లక్ పాలనను గుర్తు చేస్తోందన్నారు.
మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఎన్నికల ప్రచార సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఓ వైపు ఎండలు మండుతున్నా లెక్క చేయకుండా రావడం ఆయా నేతల్లో ఆనందం నింపింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్ధేశంతో బీజేపీ డబ్బులు పంచాలని చూస్తోందని..జాగ్రత్తగా ఉండాలని కోరారు. దక్షిణాదిలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని..తమకు పూర్తి మద్ధతు తెలపాలని వీరు కోరారు. బీజేపీయేతర పార్టీలే పవర్‌లోకి వస్తాయని ..సుస్థిరమైన పాలనను అందజేస్తామని అగ్ర నేతలు స్పష్టం చేశారు. దేశ ధనమంతా విదేశీ ఖాతాల్లోకి చేరుతున్నాయని..దీనిని జాగ్రత్తగా గమనించాలని చెప్పారు. తెలుగు వారు తమ ఆత్మగౌరవాన్ని చాటు కోవాలని..బీజేపీ అభ్యర్థులకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
గతంలో పీవీ, దేవగౌడల నేతృత్వంలో ప్రభుత్వాలు చక్కగా కొనసాగాయని గుర్తు చేశారు. అంతకు ముందు రాహుల్ గాంధీ కన్నడంలో మాట్లాడి జనాన్ని ఉత్సాహ పరిచారు. ఏపీలో చంద్రబాబు నాయుడే తిరిగి అధికారంలోకి వస్తాడంటూ జోస్యం చెప్పారు. జగన్ కంటున్న కలలు కల్లలవుతాయని అన్నారు. రఫిల్ యుద్ధ విమానాల కొనుగోలు ద్వారా 30 వేల కోట్ల రూపాయలు అంబానీ జేబుల్లోకి వెళ్లేలా మోదీ చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పొద్దస్తమానం ధర్మం గురించి మాట్లాడే మోదీ అద్వానీని గౌరవించరని ..ఈయన ఎలా ప్రజలను ప్రేమిస్తారని ప్రశ్నించారు. ఇంకో వైపు బీజేపీ తనదైన శైలిలో చాప కింద నీరులా ప్రచారం చేస్తోంది. కర్ణాటకలో కమలం ఎప్పుడూ లేనంతగా ఆదరణ కోల్పోయింది. నోట్ల రద్దు, జీఎస్టీ , బ్యాంకుల్లో డబ్బులు నిల్వ లేక పోవడం కూడా ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ప్రశ్నార్తకంగా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి