కార్మికులకు మంగళం..ప్రైవేట్ కు అందలం

ఘనమైన చరిత్ర కలిగిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు దిశమొలతో నిలబడ్డది. గత పాలకుల దోపిడీ, ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం శ్రమజీవులైన కార్మికుల పాలిట శాపంగా మారింది. త్యాగాల, పోరాటాల, బలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కన్నీళ్లు తప్ప పన్నీరు అందడం లేదు. అయితే ఎన్నికలు లేదంటే రియల్ దందాలకు ఈ ప్రాంతం అడ్డాగా మారి పోయింది. కొన్ని తరాల నుండి కాపాడుకుంటూ వస్తున్న ఆర్టీసీ సంస్థకు చెందిన ఆస్తులన్నీ ఇప్పుడు ప్రైవేట్ పరం కాబోతున్నాయి. దీనిని నిరసిస్తూ కార్మికులు, ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. గత 30 రోజులుగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు.

అయినా సర్కారు ఇటు వైపు చూడడం లేదు. పోలీసులు అరెస్టులు ఆపడం లేదు. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న సీఎం కేసీఆర్ సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ చేసిన వ్యాఖ్యలు కార్మికులను ఆందోళనకు గురి చేశాయి. 22 మంది ఇప్పటికే చని పోయారు. మరికొందరు విధుల్లోకి చేరమంటూ అల్టిమేటం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి విధించిన డెడ్ లైన్ ముగిసింది. మరోసారి కార్మికులకు ఛాన్స్ ఇచ్చారు. అయినా కార్మికులు ససేమిరా అన్నారు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ లోపు గడువు లోగా చేరని కార్మి కులను ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేర్చు కోవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాలు కాపాడు కోవడమా లేక వినియోగించు కోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసు కోవడమా అనేది కార్మికులే తేల్చు కోవాలని స్పష్టం చేసింది.

కార్మికులు చేరకుంటే, మిగిలిన 5 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని, అప్పుడు తెలంగాణలో ఇక ఆర్టీసీ అంటూ ఉండదని మరో సారి ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం వెల్లడించింది. ఆర్టీసీ సమ్మె, హైకోర్టు విచారణ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌, మంత్రి పువ్వాడ తో సమీక్షించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు. హైకోర్టులో జరుగుతున్న విచారణను చూపి, యూనియన్‌ నేతలు కార్మికులను మభ్య పెడుతున్నారు. సమ్మె విషయంలో కోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలిచ్చే అవకాశం లేదు. కోర్టు తేల్చ గలిగింది కూడా ఏమీ లేదు. మొత్తం మీద కేసీఆర్ ప్రైవేట్ పరం చేసేందుకు డిసైడ్ అయ్యారన్నమాట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!