దుమ్ము రేపారు..రఫ్ఫాడించారు
ఇండియన్ విమెన్స్ క్రికెట్ జట్టు కోలుకుంది. విండీస్ విమెన్స్ జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఓడి పోయింది. తిరిగి రెండో వన్డే మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకుంది. భారత్ మహిళల జట్టు 53 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ 128 బంతుల్లో 77 పరుగులు చేయగా, కెప్టెన్ మిథాలీ రాజ్ 67 బంతుల్లో 40, హర్మన్ ప్రీత్ కౌర్ 52 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ మహిళల జట్టు 47.2 ఓవర్లలో 138 పరుగులకే కుప్ప కూలింది.
ఆ జట్టులో క్యాంప్‌బెల్ 90 బంతుల్లో 39 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ తలా 2 వికెట్లు తీసి విండీస్ జట్టు ఆటగాళ్లను కట్టడి చేశారు. ఇదిలా ఉండగా భారత్ 17 పరుగులకే ఓపెనర్లు పూనియా 5, జెమీమా సున్నాకే పెవిలీయన్ దారి పట్టారు. వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పూనమ్ రౌత్, మిథాలీ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. తొలి 9 ఓవర్లలో భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా లేక పోగా, మిథాలీ తాను ఎదుర్కొన్న మూడో బంతిని బౌండరీకి తరలించి బోణీ చేసింది. పూనమ్ నెమ్మదిగా ఆడుతూ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేసింది. తన 70వ బంతికి గానీ ఆమె తొలి ఫోర్ కొట్టలేక పోయింది.
వీరిద్దరు మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అనంతరం పూనమ్‌తో జత కలిసిన హర్మన్ దూకుడుగా ఆడింది. పూనమ్ కూడా ధాటిని పెంచడంతో పరుగులు వేగంగా వచ్చాయి. 17.5 ఓవర్లలోనే వీరిద్దరు నాలుగో వికెట్‌కు 93 పరుగులు జత చేయడం విశేషం. ఆరు బంతుల వ్యవధిలో పూనమ్, హర్మన్ అవుటయ్యారు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ మొదటి నుంచి తడ బడుతూనే సాగింది. ఎవరూ భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక పోయారు. కెప్టెన్ స్టెఫానీ టేలర్ 20 విఫలం కావడంతో ఆ జట్టు విజయంపై ఆశలు కోల్పోయింది. సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమానంగా నిలిచాయి. మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి