ఐసీఐసీఐపై కోర్టులో కొచర్ దావా
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచర్ తనను సీఈవోగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు 2009 నుంచి 2019 వరకు పొందిన బోనస్‌లను తిరిగి ఇచ్చేయాలని కోరుతూ, ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు నిర్ణయంపై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రంజిత్, జస్టిస్ కార్నిక్‌తో కూడిన దర్మాసనం వాదనలు విననుంది. మరోవైపు హేతుబద్దమైన ఆధారాలు, ఆర్‌బీఐ అనుమతి లేకుండా తనను తొలగించడం పైనే, ఆమె పిటిషన్‌లోని ముఖ్య అంశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
చందాకొచర్ తరుపున విక్రమ్ నన్‌కాని, సుజయ్ కంతవాలా వాదనలు వినిపిస్తుండగా ఐసీసీఐ బ్యాంక్ తరపున డారియస్ కమ్ బాటా వినిపించనున్నారు. కాగా ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా ఉన్న చందా కొచర్‌పై వీడియోకాన్ రుణాలకు సంబంధించిన క్రిడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ చందా కొచర్, భర్త దీపక్ కొచర్‌తో పాటు ఇతర బంధువులను కూడా చార్జ్ షీటులో చేర్చింది. అయితే ప్రారంభంలో చందా కొచర్‌ను బోర్డు వెనకేసుకు వచ్చింది.
ఆమెపై వచ్చిన ఆరోపణలపై మాజీ న్యాయమూర్తి బీఎన్ కృష్ణ ఆధ్వర్యంలోని స్వతంత్ర దర్యాప్తు కమిటీ నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా కొచర్ ను వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా చందా కొచర్ తాను విధులు చేపట్టిన సమయంలో ఎన్నో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఆమెను బాధ్యతల నుంచి యాజమాన్యం తొలగించింది. కాగా చాలా గ్యాప్ తర్వాత కొచర్ కోర్టుకు వెళ్లడం పలువురిని విస్తు పోయేలా చేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి