!సినిమా జూదంలో కొందరే హీరోలు .!

                          
బతుకును, ఈ ప్రపంచాన్ని ఆవిష్కరించే పనిముట్లలో ఒకే ఒక్క సాధనం కెమేరా. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటూ వెంటాడేది మాత్రం ఛాయా చిత్రం. అంతకంటే దృశ్యం కూడా. ఎవ్వరూ ఊహించని అద్భుతం సినిమా. అది చేసే మాయాజాలం ఇంకేదీ చెయ్యదు. అందుకే దాని కోసం వెంపర్లాడేది. పస్తులు ఉండేది. కోట్లాది మంది ఇప్పటికీ దానితో కనెక్ట్ అయి ఉన్నారు. దానిని చూడకుండా, దానితో అనుసంధానమై లేకుండా ఉండలేక పోతున్నారు. వేలాది మందికి సినిమా ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో బతుకునిస్తోంది. క్రియేటివిటీ కలిగిన వాళ్ళు లెక్కించ లేనంత మంది ఉన్నారు. ఒక్కొరొక్కరు ఒక్కో సునామి. అందుకే ఇన్ని విజయవంతమైన మూవీస్ మన ముందుకు వస్తున్నాయి. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. అది తన దారిని మరింతగా విస్తృతం చేసుకుంటోంది. 

సినిమా అంటేనే ఓ జూదం లాంటిది. దానిహో ఒక్కసారి కమ్మిత్ అయ్యామా ఇక అంతే సంగతి. తినబుద్ది కాదు. ఒకటే కల దానితోనే బతుకు. ప్రతి సినిమాకు మాటలే కాదు అంతకంటే ఎక్కువగా పాటలు , నేపధ్య సంగీతం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి లేకుండా మూవీస్ సక్సెస్ అయ్యే పరిస్థులు ఇప్పుడు లేవు. టెక్నలాజి మారింది. రాసే వాళ్ళు ఎక్కువై పోయారు. కానీ కొందరే ఇంకా అలా మిగిలి పోయారు.పేరుకు పది మంది ఉన్నప్పటికినీ, ఇద్దరు లేదా నలుగురు మాత్రమే టాప్ లో నిలుస్తున్నారు. తమదైన సరుకుతో నెట్టుకు వస్తున్నారు. ఇక్కడ టాలెంట్ కు మాత్రమే గుర్తింపు ఉంటుంది. ఇది లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా వాళ్లకు భారీ ఎత్తున ఆదాయం వస్తోంది తెలంగాణ ప్రాంతం నుంచే.కానీ మనోళ్లకు ఛాన్సెస్ తక్కువ. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇప్పుడు సినీ టెక్నీషియన్స్ మన ఆర్టిస్టులను గౌరవించడం మొదలు పెట్టారు. 

తెలంగాణ భాషకు, యాసకు మరింతగా ప్రాధాన్యత పెరిగింది. చంద్రబోస్ , సుద్దాల అశోక్ తేజ, వరికుప్పల యాదగిరి , కాసర్ల శ్యామ్ లాంటి వాళ్ళు ఎందరో ప్రతిభకు పదును పెడుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వరికుప్పల మాత్రం వెరీ వెరీ స్పెషల్. కొన్నేళ్ల కిందట అందమైన కుందనాల బొమ్మరా అంటూ  ఓ పాట తెలుగు వారిని ఆకట్టుకుంది. గుండెల్ని మీటింది. ఎన్నో ఇబ్బందులు పడినా మంచి బ్రేక్ రాలేదు. అవకాశం ప్రతి సారి తలుపు తట్టదు. ఒక్కసారి మాత్రమే పలకరిస్తుంది. అప్పుడే అందుకోవాలి. లేకపోతే సినిమా వెళ్లి పోతుంది. వరికుప్పల కూడా తనను తాను నిరూపించుకునే టైం రాలేదు. సురేందర్ రెడ్డి ఇచ్చిన ఛాన్స్ తో మరోసారి వెలుగులోకి వచ్చాడు. సినిమా చూపిస్త మావా. అంటూ దుమ్ము రేపింది. తాజాగా తెలంగాణకు చెందిన దర్శకులు, రచయితలు, హీరోలు తామేమిటో నిరూపిస్తున్నారు. డైరెక్టర్లలో చూస్తే వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి , హరీష్ శంకర్ , వంగా సందీప్ రెడ్డి , తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు ఉండగా నిర్మాతల్లో దిల్ రాజు , హీరోల్లో విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. రియల్ హీరోలుగా రాణిస్తున్నారు. 

కామెంట్‌లు