టాలీవుడ్.లో..తెలంగాణ డైరెక్టర్ల హవా..!

తెలుగు సినిమా అనే సరికల్లా టక్కున గుర్తుకు వచ్చేది హీరో, హీరోయిన్లు. ఒకప్పుడు వీరి గురించే చర్చ అంతా జరిగేది. వీరికే ప్రయారిటీ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. సినిమా అన్నది విజయవంతం కావాలంటే దమ్మున్న డైరెక్టర్ కావాలి. . అంతకంటే ఎక్కువగా ప్రేక్షకులకు కావాల్సిన, మాస్ మాసాలతో పాటు పవర్ ఫుల్ మాటలు ఉండాలి. అందుకే ఇప్పుడు డైరెక్టర్లు రియల్ హీరోలుగా మారి పోయారు. ఒక్కో దర్శకుడి రేంజ్ హీరోకు మించి పోయిందంటే నమ్మగలమా. ఒకప్పుడు ఇతర సినిమా డైరెక్టర్ల డామినేషన్ ఎక్కువగా ఉండేది .ఇప్పుడు సీన్ పూర్తిగా మారి పోయింది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగాన్ని మనోళ్లే ఏలుతున్నారు.
డైరెక్టర్ల పరంగా చూస్తే ఒకే ఒక్క అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ పొజిషన్ లోకి దూసుకు వెళ్ళాడు వంగా సందీప్ రెడ్డి. మహేష్ బాబు తో సినిమా చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఎందుకనో అది మధ్యలోనే ఆగి పోయింది. ఇదే సందీప్ రెడ్డి షాహిద్ కపూర్ తో హిందీలో తీశాడు. అది బ్లాక్ బ్లస్టర్ గా రికార్డ్ బ్రేక్ చేసింది.మొత్తంలో ఓ 10 మందిని చూస్తే అందులో మనోళ్లే ముందు వరుసలో ఉన్నారు. వారిలో తరుణ్ భాస్కర్ కూడా బాగా పేరు సంపాదించాడు. వరంగల్ జిల్లాకు చెందిన తరుణ్ తీసిన పెళ్లి చూపులు భారీ సక్సెస్. తెలంగాణ యాసకు , కల్చర్ కు పెద్ద పీట వేశాడు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు కూడా అందుకున్నారు.
సందీప్ రెడ్డి కూడా పోరుగల్లుకు చెందిన వాడే. 2017 లో విజయ్ దేవరకొండ తో తీసిన అర్జున్ రెడ్డి బిగ్ హిట్. మరో దర్శకుడు సంకల్ప్ రెడ్డిది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా. ఆస్ట్రేలియాలో చదువుకున్నారు. ఘాజి అటాక్ సినిమా తీశారు. ఇది సూపర్ సక్సెస్. నేషనల్ స్థాయిలో అవార్డు దక్కింది. వరుణ్ తేజ్ తో అంతరిక్షం అనే సినిమా చేస్తున్నాడు. మరో కుర్రాడు నాగ్ అశ్విన్ రెడ్డి . మాస్ కమ్యూనికేషన్ చేసిన ఆయన తీసిన మహానటి సెన్సేషనల్ హిట్. నాగ్ స్వంత ఊరు పాలమూరు జిల్లా తాడూరు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందింది ఈ సినిమా. మరో దర్శకుడు వెంకీ కుసుమాల కూడా తెలంగాణకు చెందిన వాడే. త్రివిక్రమ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. చలో సినిమా తీశాడు. ఇది బంపర్ హిట్.
నల్లగొండ జిల్లాకు చెందిన సాగర్ కె. చంద్ర రెడ్డి సూపర్ హిట్ మూవీ తీసాడు. అదే అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమా. ప్రస్తుతం నారా రోహిత్ తో మరో సినిమా చేయబోతున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన మరో దర్శకుడు వేణు ఉద్గాల. ఎందరో దర్శకుల వద్ద పని చేసిన అనుభవం అతడికి ఉన్నది. ఈ అనుభవం తో నీది నాది ఒకే కథ పేరుతో సినిమా తీసాడు. ఇది కూడా హిట్ గా నిలిచింది. ఇక సురేందర్ రెడ్డి బిగ్గెస్ట్ డైరెక్టర్ గా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. ఈయనది కరీంనగర్ జిల్లా. అతనొక్కడే మూవీతో స్టార్ట్ చేశాడు. కిక్ , రేస్ గుర్రం లాంటి బిగ్ హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు చిరంజీవితో సైరా సినిమా చేస్తున్నాడు.
వంశీ పైడిపల్లి కూడా మనోడే. నిర్మల్ ప్రాంతానికి చెందిన వారు. బృందావనం హిట్ కాగా మహేష్ బాబు తో తీసిన మహర్షి పెద్ద సక్సెస్. ఇక హరీష్ శంకర్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ డైరెక్టరల్లో ఒకడిగా ఉన్నారు. ఇతనిది కరీంనగర్ జిల్లా. మొదటగా వీడే మూవీ తీశాడు. ఏ ఫిలిం బై అరవింద్ , గబ్బర్ సింగ్ , మిరప కాయ్ సినిమాలు పెద్ద హిట్ . మరో దిగ్గజ దర్శకుడు గా ఇప్పటికే పేరు సంపాదించారు . ఎన్. శంకర్. శ్రీ రాములయ్య , జయం మనదేరా , జై బోలో తెలంగాణ లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తీశారు ఆయన. ఇతను ఇప్పుడు సినిమా దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. మొత్తం మీద తెలుగు సినిమాను తెలంగాణ వాళ్లదే హవా కొనసాగుతోందని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి..?

కామెంట్‌లు