ముఖేష్ అభయం..జియోకు లాభం
రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఏ ముహూర్తం లో జియో ను స్టార్ట్ చేశాడో ఇక అది అంతకంతకు పెరుగుతూ పోతోంది. భారతీయ టెలికం రంగాన్ని జియో షేక్ చేస్తోంది. ప్రభుత్వ అధీనంలో ఉన్న, అతిపెద్ద బ్యాండ్ విడ్త్ నెట్ వర్క్ కలిగిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (బీఎస్ ఎన్ ఎల్ ) తో పాటు ఇతర ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు జియో దెబ్బకు అబ్బా అంటున్నాయి. దాని మార్కెట్ స్ట్రాటజీని తట్టుకోలేక పక్క చూపులు చూస్తున్నాయి. త్వరలో తక్కువ ధరకే డేటా, టీవీ, మూవీస్ కనెక్షన్ ఇస్తున్నట్టు ప్రకటించారు ముంబైలో ముకేశ్ అంబానీ. దీంతో ఒక్కసారిగా పడిపోయిన షేర్లు అమాంతం పెరిగాయి. తమ కంపెనీ పేరుమీదున్న అప్పులన్నీ వచ్చే ఏడాది లోపే తీర్చేస్తామని, ఇక వెనుతిరిగి చూసే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు.
ఇంకేం ఇండియన్ మార్కెట్ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. టెలికం రంగంలో జియో సంచలనం రేపింది. దాని దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. ఒకే ఒక్క ప్రకటనతో గత జూన్ నెలలో 33 కోట్ల మందితో ఉన్నకస్టమర్లు ఏకంగా ఒక్క రోజులోనే మరో 82 లక్షల మంది జియో కనెక్షన్ కొత్తగా తీసుకున్నారు. ఇది ఓ రికార్డ్ . ఇదే సమయంలో ఇప్పటి దాకా టాప్ పొజిషన్ లో ఉన్న ఎయిర్ టెల్ , వోడాఫోన్ , ఐడియా టెలికం కంపెనీలు అంతకంతకు తమ కస్టమర్లను కోల్పోతున్నాయి. వీరికి చెందిన కస్టమర్లు జియో లోకి మారి పోతున్నారు. జూన్ నెలలో ఈ రెండు కంపెనీలు ఏకంగా 41 లక్షలకు పైగా చందాదారులను కోల్పోయాయి. ఈ వివరాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా - ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
భారీ ఎత్తున కస్టమర్లను కోల్పోతుండడం తో ఆయా కంపెనీలకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతోంది. వోడా ఫోన్ నుండి 41 లక్షల మంది వెళ్లి పోతే , ఎయిర్ టెల్ నుంచి 29,౮౮౩ మంది చందాదారులు మరో నెట్ వర్క్ కు మారారు. దీంతో ఆ నెలాఖరు నాటికి వోడాఫోన్ , ఐడియా కస్టమర్లు 38 కోట్లకు పది పోగా రిలయన్స్ రెండో స్థానంలో , ఎయిర్ టెల్ మూడో ప్లేస్ లో ఉండి పోయింది. అయితే విచిత్రం ఏమిటంటే ప్రైవేట్ టెలికం ఆపరేటర్ల చందాదారులు ఇతర నెట్ వర్క్ లోకి మారిపోతే , బీఎస్ ఎన్ ఎల్ కస్టమర్లు మాత్రం అంతకంతకు పెరుగుతూ ఉండడం మార్కెట్ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఇదే నెలలో ఈ ప్రభుత్వ కంపెనీకి 2 లక్షల మంది కొత్తగా కనెక్షన్ తీసుకున్నారు. జియో రాకతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు వాటి నుంచి గట్టెక్కేందుకు.. ‘ప్రతినెలా కనీస రీఛార్జి చేసుకుంటేనే, ఇన్‌కమింగ్ సేవలు లభిస్తాయనే’ షరతు విధించాయి. దీంతో చందాదారులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి