నమో నమామి ..మోదీ సునామి..ఒకే ఒక్కడు..దమ్మున్నోడు..!
సమున్నత భారతావనిలో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక్క పదం మోదీ. ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి దాకా మోదీ..మోదీ అంటూ కోట్లాది గొంతుకలు దద్దరిల్లేలా వినిపిస్తున్నాయి. ఈ 69 ఏళ్ళ సామాన్యుడు అసాధారణమైన రీతిలో 130 కోట్ల జనాభా కలిగిన, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఏకైక చాయ్ వాలా నరేంద్ర దామోదర దాస్ మోదీ ఒక్కరే. ఒకప్పుడు రైల్వే స్టేషన్ లో టీ అమ్మిన అతి సాధారణమైన వ్యక్తి అంచెలంచెలుగా ముఖ్యమంత్రిగా, దేశానికి నాయకత్వం వహించే పీఎం గా ఎదిగారు. ఇలాంటి అరుదైన సన్నివేశాలు ఒక్క ఇండియాలోనే చోటు చేసుకుంటాయి. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, విమర్శలు చెలరేగినా పట్టించు కోకుండా దేశానికి దిశా నిర్దేశనం చేస్తూ ఉక్కు సంకల్పంతో దాయాది దేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఒకే ఒక్క డైనమిక్ లీడర్ మోదీనే.
ఆయన ఒక్క సారి డిసైడ్ అయ్యాడంటే ఇక వార్ వన్ సైడ్ కావాల్సిందే. లేకపోతే అక్కడ సునామీ చోటు చేసుకుంటుంది. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ , ప్రత్యర్థుల్లో భయాన్ని కలుగ చేస్తూ ప్రపంచం విస్తు పోయేలా దేశాధి నేతలతో కరచాలనం చేస్తూ, మేరా భారత్ మహాన్ అనేలా తీర్చి దిద్దుతున్న ఏకైక నాయకుడు. ఈ దేశానికి అంది వచ్చిన భూమి పుత్రుడు దామోదర దాస్ మోదీజీ. ఎవరిని ఎప్పుడు చేరదీయలో, ఎవరిని ఎప్పుడు దెబ్బ కోటాలో ఆయనకు తెలిసినంతగా ఇంకే నాయకుడికి తెలీదంటే అతిశయోక్తి కాదు. స్వచ్ఛ భారత్ అంటూ ఒకే ఒక్క పిలుపుతో దేశంలో ప్రకంపనలు పుట్టించాడు. దేశ వ్యాప్తంగా తన రాజకీయ చతురతతో, ఆచరణాత్మక నిర్ణయాలతో ప్రత్యర్థులను కోలుకోకుండా చేసిన ఘనత మోడీదే. భారతీయ జనతా పార్టీ దాని పరివారాలు, సంస్థలన్నీ ఇప్పుడు మోదీ ని తమ నాయకుడిగా ఒప్పుకున్నాయి. అంతేనా మోదీనే తమ బ్రాండ్ గా ప్రమోట్ చేసుకుంటున్నాయి.
ఓటమిని ఒప్పుకోని మనస్తత్వం కలిగిన మోదీ అమెరికా, చైనాలకు చుక్కలు చూపిస్తున్నారు. గత కొన్ని శతాబ్దాలుగా, పరిష్కారానికి నోచుకోని జమ్మూ , కాశ్మీర్ విషయంలో అడ్డంకిగా ఉన్న 370 ఆర్టికల్ ను రద్దు చేశారు. తనకు ఎదురే లేదంటూ చెప్పకనే చెప్పారు. దీంతో ఈ ఒక్క అసాధారణమైన డెషిషన్ తో మోదీ గ్రాఫ్ ఏ నాయకుడు అందుకోలేని స్థితికి చేరుకుంది. మొండి ఘటంగా, ధైర్యవంతుడిగా, ఎవరికీ లొంగని వ్యక్తిగా మోడీకి పేరుంది. అంతే కాదు బీజీపీని రెండు సార్లు పవర్ లోకి తీసుకు వచ్చిన ఘనత ఆయనదే. 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగు లేకుండా పోయింది. 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవ సారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 2000 నుంచి 2014 మే 21 నాడు రాజీనామా చేసే వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు.
రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని అమెరికా అభివర్ణించింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయ పథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించి పెట్టి మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు. 2019 ఎన్నికలలో తిరిగి గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు మోదీ. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేశారు. 1970 లో విశ్వ హిందూ పరిషత్తులో చేరారు. గుజరాత్‌లోని ఒక మారుమూల గ్రామంలో చాయ్ అమ్మడం ద్వారా మొదలు పెట్టిన జీవితం అనేక మలుపులు తిరిగింది. శాసనమండలి సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవులు పొందారు. 1987లో నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీలో ప్రవేశించారు. కొద్ది కాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు,1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కాశ్మీర్ రథయాత్రకు ఇన్‌చార్జీగా పనిచేశారు.
1998లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన కేశూభాయి పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2001 అక్టోబరులో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించింది. ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించారు. భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. 2002లో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వానికి కష్టం కల్గించాయి. దేశ వ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. 2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాలలో విజయం చేకూర్చి వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు.
2007 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆకర్షించాయి. 182 స్థానాలకు గాను 117 స్థానాలు పొందటం విశేషం. తాను 2001 నుంచే కాదు ఎప్పటి నుంచో సీఎం అని, ఎప్పటికీ గుజరాత్ సీఎం నేనని, సీఎం అంటే కామన్ మ్యాన్ అని నరేంద్ర మోదీ సరి కొత్త భాష్యం చెప్పారు. 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సునాయాస విజయాన్ని నమోదు చేసింది. వరసగా 4వ సారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నరేంద్ర మోదీ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. వేగంగా జరిగిన రాజకీయ పరిణామాలతో ఏకంగా మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి వెళ్ళింది. 2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే మోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించడంతో, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు వీచాయి. మొదట్లో మోదీ రాజకీయ గురువు లాల్ కృష్ణ అద్వాని అడ్డు తగిలినప్పటికీ అనంతరం ఆయన కూడా మోదీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ మోదీ ప్రభావంతో గణనీయమైన స్థానాలు సాధించింది. మోదీ స్వయంగా వడోదర నుంచి 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా వారణాసిలో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడ్డారు. నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల భూమిని సాగులోనికి తెచ్చారు. తాగునీటి సరఫరా, జల విద్యుత్‌పై కూడా శ్రద్ధ చూపారు. అనేక మహిళా పథకాలను చేపట్టారు. పెట్టుబడులను రప్పించడంలో, పారిశ్రామిక అభివృద్ధిలో, ఎగుమతులలో గుజరాత్ రాష్ట్రాన్ని మోదీ అగ్రస్థానంలో నిలిపారు. భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ పలు వివాదాస్పదమైన నిర్ణయాలు, పాలసీలు అమలు చేశాడు. వాటిలో 500, 1000 రూపాయల నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటివి ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీకి తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు లభించింది. 2019 లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. విశిష్ట లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకు గాను మోడీకి ఈ అవార్డు దక్కింది. మొత్తం మీద మోదీ ఇండియాకు ఓ రోల్ మాడల్ గా మిగిలి పోయారు. ఆయన మరింతగా ఎదగాలని కోరుకుందాం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి