ఐడియా అదుర్స్..లోన్స్ ఈజీ బాస్

ఒకప్పుడు అప్పు కావాలన్నా, తీసుకోవాలంటే నానా ఇబ్బందులు. చెప్పలేనంత కష్టాలు. కానీ లోకం మారింది. టెక్నాలజీ రోజు రోజుకు అప్ డేట్ అవుతోంది. డబ్బులు లేకుండా ఇప్పుడు బతక లేని పరిస్థితి. డబ్బే లోకం లేకపోతే జీవితం పరమ బోర్. అన్ని దేశాలు, అధిపతులు పొద్దస్తమానం మనీ జపం చేస్తున్నారు. అర్జెంటు గా డబ్బులు అవసరం పడితే ఎవరినీ దేబరించాల్సిన పని లేదు. ఎంచక్కా మీ స్మార్ట్ ఫోన్ మీ చేతిలో వుంటే చాలు . అదే మీకు క్షణాల్లో మీ అకౌంట్ లోకి ఎన్ని డబ్బులైనా జమ చేసేస్తోంది. ఒకప్పుడు బ్యాంకుల మీదే ఆధార పడే వాళ్ళం. ఇప్పుడు ఆ బాధ తప్పింది జనాలకు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ జనం చేతుల్లో ఫుల్ గా మనీ సర్క్యులేట్ అవుతోంది. ప్రతి ఒక్కరికి కోరుకున్న సమయంలో అప్పు కావాలంటే ఇచ్చే వాళ్ళుండాలి. దానికి దమ్ముండాలి లేదంటే దాతృత్వమైనా ఉండాలి. రుణాలు ఇచ్చే వారు ..అప్పులు కావాలనుకునే వారి మధ్య కనెక్టివిటీ ఉండేలా ఓ ప్లాట్ ఫార్మ్ ఉంటే ఎలా ఉంటుందో అనే ఆలోచనలో పుట్టిందే లెన్‌డెన్‌క్లబ్‌.

ఇప్పటికే ఈ కంపెనీలో 10 వేల మంది దాతలు, 51 వేల మంది రుణం కావాల్సిన వాళ్ళు నమోదు చేసుకున్నారు. ఈ సంస్థకు డిమాండ్ పెరగడం, నియమ నిబంధనలకు లోబడి , సేవలు అందజేస్తుండడంతో కొద్దీ కాలంలోనే గణనీయమైన రీతిలో సక్సెస్ అయ్యింది. ఐదు రాష్ట్రాలలో 40 కోట్లకు పైగా రుణాలు ఇచ్చింది. కేవలం మూడు నెలల లోపే 10 కోట్లను సమీకరించింది. రుణదాతలు, గ్రహీతలను కలిపే ‘పీర్‌ టు పీర్‌’ లెండింగ్‌ పద్దతిని ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లూ ఉద్యోగులకే రుణాలిచ్చిన లెన్‌డెన్‌ క్లబ్‌.. త్వరలో దుకాణదారులకూ అప్పు ఇవ్వడానికి సిద్ధమైంది.  2015లో  80 లక్షల పెట్టుబడితో గుర్గావ్‌ కేంద్రంగా దీనిని స్టార్ట్ చేశారు భవిన్ పటేల్. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకు మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు.

కేవైసీ పూర్తి చేసిన 3 గంటల్లో రుణం మంజూరు చేస్తారు. 40 వేల నుంచి 5 లక్షల దాకా అప్పు పొందవచ్చు. వడ్డీ రేటు 12.5 నుంచి 35 శాతం వరకు ఉంటుంది. తీసుకున్న అప్పునకు సంబంధించి వాయిదాలను 18–36 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కంపెనీ రుణాలు విరివిగా అందజేసింది. మన తెలంగాణ నుంచి నెలకు 150 రుణ గ్రహీతలకు 70 లక్షల వరకు అప్పుల రూపేణా అందజేసింది. డిసెంబర్‌ నాటికి నెలకు వెయ్యి మందికి రుణాలను అందించాలనేది కంపెనీ త్రాగేట్ గా పెట్టుకుంది. లెన్‌ డెన్‌ క్లబ్‌ రుణ దాత నుంచి 1.5 శాతం, రుణ గ్రహీత నుంచి 4 శాతం నిర్వహణ రుసుము కింద వసూలు చేస్తుంది. గతేడాది  55 లక్షల ఆదాయాన్ని గడించింది ఈ కంపెనీ. తోటి వారే నమ్మని ఈ లోకంలో ఆపదలో ఆదుకుంటున్న ఇలాంటి కంపెనీ ఉండడం అదృష్టం కదూ. ఇంకెందుకు ఆలశ్యం లోన్ కోసం ట్రై చేయండి. 

కామెంట్‌లు