ధరాభారం ఇండియాకు కష్ట కాలం..!
ఇప్పటికే భారత ఆర్ధిక వ్యవస్థ అష్ట వ్యస్తంగా తయారైన సమయంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఆయిల్ ధరలు అమాంతం పెరిగాయి. చమురు లేకుండా ఏపనీ జరగని పరిస్థితి నెలకొన్నది. తీవ్ర మంద గమనంతో కొట్టు మిట్టాడుతున్న ఇండియాకు ముడి చమురు రూపంలో మరో ముప్పు ముంచు కొచ్చింది. సౌదీలో చమురు బావులపై దాడులు జరుగుతూనే వున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం మనపై ఎక్కువగా ఉంటోంది. దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతానికి పైగా చమురును మనం దిగుమతి చేసుకుంటున్నాం.ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన దిగుమతిదారుగా ఉన్నది. ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్న కరెంట్ ఖాతా లోటు ముడి చమురు ధరల పెరుగుదలతో మళ్లీ అదుపు తప్పే ప్రమాదం ఉంది.
అలాగే ద్రవ్య లోటు టార్గెట్స్ పైనా ప్రభావం చూపనుంది. మొత్తంగా వృద్ధికి మరింత గండి పడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా రేట్స్ పెరిగి పోయాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో చమురును కొనక తప్పని పరిస్థితి. దీని కారణంగా ఇంధన దిగుమతులపై భారం మరింత పెరగనుంది. బ్రెంట్ రకం ముడి చమురు పీపా ధర ఒక్కో డాలర్ పెరిగిన కొద్దీ మన ఇంధన దిగుమతుల బిల్లు 200 కోట్ల డాలర్ల మేర పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు 10 శాతం పెరిగితే కరెంట్ ఖాతా లోటు 0.4-0.5 శాతం పెరగవచ్చని ఆర్థిక సేవల సంస్థ డీబీఎస్ వెల్లడించింది. అధిక ఇంధన దిగుమతుల తో రూపాయి మారకం విలువకూ గండి పడవచ్చని హెచ్చరించింది. ఇంటర్ నేషనల్ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే దేశీయంగా మన ఇంధన విక్రయ సంస్థలు లీటరు పెట్రోల్, డీజిల్ ధరను అయిదు నుంచి ఆరు రూపాయలకు పెంచాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంధన సంస్థల మార్జిన్లపైనా ఒత్తిడి పెరగవచ్చని విశ్లేషకులంటున్నారు.
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు గడిచిన 28 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. పీపా ధర ఫ్యూచర్స్ మార్కెట్లో 71 డాలర్లకు ఎగబాకింది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లో ఇంధన విక్రయ కంపెనీల షేర్లు భారీ నష్టాలను నమోదు చేసుకున్నాయి. ముడి చమురు ధరల సెగ రూపాయికీ గట్టిగానే తగిలింది. డాలర్‌తో రూపాయి మారకం రేటు 68 పైసలు బలహీనపడి 71.60 వద్దకు చేరుకుంది. ముడి చమురు కొనుగోలుకు దిగుమతిదారులు డాలర్ కొనుగోళ్లు పెంచడంతోపాటు ఈక్విటీ మార్కెట్లు నష్టాల కొనసాగడం, విదేశీ పెట్టుబడులు తరలి పోవడం రూపాయి విలువ తగ్గడంపై ప్రభావం చూపాయి. మొత్తం మీద సౌదీ చమురు బావులపై దాడులు మనకు శాపంగా మారాయి. ఇన్నేళ్లయినా స్వయం సమృద్ధిని సాధించలేక పోవడం కూడా ప్రధాన కారణం. ఇప్పటి వరకు ప్రత్యామ్నాయం దిశగా ప్రయత్నాలు చేయక పోవడం వల్లనే ఇవ్వాళ ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తున్నది. దేశంలో అపారమైన వనరులున్నా వాటిని ఉపయోగించుకోవడంలో పాలకులు , ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి. రాను రాను ఇలాగే వ్యవహరిస్తే ఈ ధరాభారం మోయలేని భారమవుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి