కంపెనీలు ఇలా .. భాగ్యనగరం భళా..!

మెరుగైన సౌకర్యాలు ..అద్భుతమైన అవకాశాలు ఉండడంతో భాగ్యనగరం వెలిగి పోతోంది . ఏ ముహూర్తాన కులీకుతుబ్ షా ఈ సుందర నగరాన్ని నిర్మించాడో ఇక అప్పటి నుంచి హైదరాబాద్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఐటీ , ఫార్మా , ఆటోమొబైల్ , లాజిస్టిక్ , తదితర రంగాలకు ఈ సిటీ కేరాఫ్ గా మారింది . ఎక్కడ చూసినా మాల్స్ , నగల దుకాణాలు దర్శనమిస్తున్నాయి. ఓ వైపు ఇండియా ఆర్ధిక మంద గమనంతో కొట్టుమిట్టాడుతుంటే మరో వైపు తెలంగాణ అన్ని రంగాలలో దూసుకు వెళుతోంది . ఇది మార్కెట్ వర్గాలను విస్తు పోయేలా చేస్తోంది. ఇది మంచి పరిణామం.

ఇప్పటికే ఐటి పరంగా బెంగళూర్ టాప్ రేంజ్ లో వుంటే, ఇప్పుడు హైదరాబాద్ దాని సరసన వచ్చి చేరింది. వివిధ దేశాలకు చెందిన ప్రధాన కంపెనీలన్నీ ఈ నగరానికి క్యూ కడుతున్నాయి. ఇక మెజారిటీ కంపెనీలు మొదటి ప్రయారిటీ దీనికే టిక్ పెడుతున్నాయి  .తెలంగాణ సర్కార్ నూతన పారిశ్రామిక పాలసీని తీసుకు వచ్చింది . వ్యాపారులకు , పారిశ్రామికవేత్తలకు దరఖాస్తు చేసుకున్న వెంటనే అంటే ఏడు రోజుల్లో అనుమతి ఇస్తోంది. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పాలసీ ఉండడంతో అంతా ఇటు వైపు మొగ్గుచూపుతున్నారు . మిగతా నగరాలకంటే ఇండియాలో హైదరాబాద్ అత్యంత నమ్మకమైన ప్లేస్ అని భావిస్తున్నారు.

హైదరాబాద్‌‌‌‌లో అన్ని రకాల మౌలిక వసతులు ఉండటం, రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, విభిన్న రంగాలకు చెందిన వారు ,  వివిధ సంస్కృతుల వాళ్లు ఉండటం, తక్కువ జీతాలకు ప్రతిభావంతులైన నిపుణులు దొరకడం వంటివి వాణిజ్య వేత్తలను ఆకర్షిస్తున్నాయని తాజాగా ఓ సంస్థ నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. చాలా మంది బిజినెస్ టైకూన్స్ ను సంప్రదిస్తే  41 శాతం మంది హైదరాబాద్‌‌‌‌కే ఓకే చెప్పడం శుభసూచకం. ఒక వేళ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తగినంత ప్రగతి సాధ్యమవుతుందని నమ్ముతున్నట్టు 97 మంది పేర్కొనడం ఈ సిటీపై ఉన్న డిమాండ్ ఏమిటో తెలియ చేస్తుంది . ఇక నైపుణ్యాలు కలిగిన వారిని ,  ప్రతిభావంతులను ఆకర్షించడంలో భాగ్యనగరం టాప్ రేంజ్ లో ఉండటం కూడా మంచిదే. 

కామెంట్‌లు