విప్లవ స్ఫూర్తి..జార్జి రెడ్డి దిక్సూచి


ప్రవహించే ఉత్తేజం జార్జి రెడ్డి. అతడు మరణించినా ఆ రూపం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన ఆ యోధుడి పేరు ఇప్పటికీ మారు మ్రోగుతూనే ఉన్నది. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ, విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగాడు జార్జిరెడ్డి. అలాంటి ఆదర్శ నీయమైన విద్యార్థి నేత బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. దళం జీవన్ రెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పోస్టర్స్ కు జనాదరణ లభిస్తోంది.

చరిత్ర మరిచి పోయిన లీడర్ అనే విషయాన్ని ట్రైలర్ లో బాగా హైలెట్ చేశారు. ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టు కుంటోంది. ప్రసుతం ట్రెండింగ్ లో ఉంది. పోస్టర్ కూడా దుమ్ము రేపుతోంది.1965 నుంచి 1975 దాకా ఉస్మానియా యూనివర్సీటీలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జ్ రెడ్డి జీవితం గురించి తెలుసు. కానీ ఈ తరానికి జార్జ్ లాంటి డైనమిక్ లీడర్ గురించి తెలుసుకునే విధంగా దీనిని రూపొందించాడు డైరెక్టర్. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని పెంచింది.

1960, 70 లలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను కళ్ళకు కట్ట బోతున్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, సిల్లీ మాంక్స్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వంగవీటి సినిమా ఫేం సందీప్ మాధవ్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహతి నటించారు. హీరో సత్య దేవ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తుండగా, ప్రముఖ మరాఠీ నటి దేవిక జార్జి రెడ్డికి తల్లి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రాయలసీమ యువ కెరటం బైరెడ్డి సిద్దార్థ రెడ్డి నంది కొట్కూర్ లో జార్జి రెడ్డి పోస్టర్ ను ఆవిష్కరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!