అతి పెద్ద ప్యాసెంజర్స్ ఫ్లయిట్ నడిపిన అయిషా - అరబ్ మహిళ సాధించిన ఘనత
ఆకాశంలో ఎగరాలంటే భయపడతాం. ఎప్పుడు కూలుతుందో..ఎప్పుడు ఎక్కడ ల్యాండ్ అవుతామో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాం. ముస్లింలు అనేసరికల్లా కట్టుబాట్లు అడ్డు వస్తాయి. కానీ అరబ్ కంట్రీస్‌లో ఇపుడు ప్రపంచీకరణ పుణ్యమా అంటూ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దుబాయిలోనైతే ఆ దేశపు యువరాజు అందరికీ స్వేచ్ఛను ప్రసాదించారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు అక్కడి మహిళలు. ప్రపంచంలోనే అత్యధిక ప్రయాణికులు ప్రయాణం సాగించే విమానాన్ని నడపాలంటే ఎంత ధైర్యం..దమ్ముండాలి. కానీ అరబ్‌కు చెందిన అయిషా అల్ మన్సౌరీ అనే మహిళా పైలట్ ఏకంగా భారీ ట్రావెలర్స్ ఉన్న ఏ380 విమానాన్ని నడిపించి ..రికార్డు సృష్టించింది.
ప్రపంచ విమానయాన చరిత్రలో ఇదో అరుదైన రికార్డుగా భావించాల్సి ఉంటుంది. అన్ని విమానాలలో కంటే ఈ విమానానికి చాలా ప్రత్యేకత ఉంది. దీనిలో ఎక్కువ మంది ప్రయాణించేందుకు వీలుంది. అన్ని సౌకర్యాలు ఇందులో ఉంటాయి. పురుషుకు ధీటుగా ..అయిషా అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి చరిత్రలోకి ఎక్కింది. ఎన్నో దేశాల నుండి ఫ్లయిట్స్ నిత్యం వెళుతూ వుంటాయి. ప్రయాణికులను చేరవేస్తుంటాయి. అబుదాభిలోని ఎయిర్ పోర్ట్ నుండి ఎక్కువ మంది ప్రయాణం చేసే ఈ ఫ్లయిట్‌కు పైలట్ గా అయిషా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి ఔరా అనిపించారు. ఎథిహాద్ ఎయిర్ వేస్ లో అయిషా సీనియర్ పైలట్ ఆఫీసర్‌గా ఉన్నారు. తన చెల్లెలు కూడా పైలట్‌గా పనిచేస్తోంది. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని..సోదరి తోడ్పాటుతో అయిషా కూడా ఏవియేషన్ రంగంలోకి దిగింది.
ఎంతో కష్టపడి పైలట్‌గా పాసైంది. ఎన్నో విమానాలను నడిపింది. కానీ ఎక్కువ మందిని తీసుకు వెళ్ల ఏ380 విమానాన్ని నడిపించడం అంటే మాటలా. ఎంతో అనుభవం ఉండాలి. ఎంతో నేర్పు..ఓర్పు..నైపుణ్యం కావాలి. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ అయిషా అల్ మన్సౌరి సునాయసంగా ఫ్లయిట్ నడిపించింది. గమ్య స్థానానికి విమానాన్ని చేర్చింది. రికార్డు నమోదు చేసింది. అయిషా మొదటిసారిగా జాయిన్ అయ్యాక..ఏ 320 ఎయిర్ బస్ నడిపించింది. జోర్డాన్ లోని అమ్మం నగరం నుండి. ఆమె ఎన్నో విమానాలు నడిపింది. సెస్నా 172 కూడా నడిపింది. కాక్‌పిట్ లో కూర్చునే సరికల్లా నన్ను నేను మరిచి పోతానని అయిషా చెప్పింది. మహిళలు ఏమైనా చేయగలరని నన్ను చూసి మీరంతా నేర్చు కోవాలని ధైర్యంగా చెబుతోంది ఆమె.
ఏ320 నడిపిన ఆమె మెలమెల్లగా భారీ విమానాలను నడిపే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఏ 330 ఫ్లయిట్ నడిపి అందరిని ఆశ్చర్య పోయేలా చేసింది అయేషా. ఏ 380 కూడా..అందులో భాగమే. సీనియర్ ఫస్ట్ ఆఫీసర్‌గా ప్రస్తుతం ఎథిహాద్ ఎయిర్ వేస్ లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తోంది. సిడ్నీ, న్యూయార్క్, పారిస్, లండన్, తదితర నగరాలకు నిత్యం విమానాలు నడిపింది. అన్ని విమానాల లాగానే ఈ భారీ విమానం కూడా. తేడా ఏమీ అనిపించలేదు. కానీ నా సమర్థతకు ఇది పరీక్ష ..దానిని నేను అధిగమించాను.
ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్చాను. తిరిగి ఎథిహాద్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చా. నా కల నెరవేరింది. ధైర్యాన్ని వీడకండి. అనుకున్నది సాదించండి. అందరికీ అవకాశాలు ఉన్నాయి. వాటిని మనం అందిపుచ్చు కోవాలి. ఇవాళ భూమి మీద ఉన్నాం. రేపు ఆకాశాన్ని కూడా మనం అందుకోవాలి అని అంటోంది..అయిషా అల్ మన్సౌరి . నిజం కదూ కలలు కనడం వేరు..ఆకాశంలో ఎగరడం వేరు. అయిషా మరిన్ని రికార్డులు నమోదు చేయాలని కోరుకుందాం. ఆమె సాధించిన ఈ విజయం కోట్లాది మహిళలకు స్ఫూర్తి దాయకం కావాలని ఆశిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి