అత్యాచారం..అయ్యో పాపం
ప్రఖ్యాత నటి అత్యాచార వీడియో లీకైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అత్యాచారం జరిగిన రెండేళ్ల తర్వాత వీడియో లీకవడం గమనార్హం. బిగ్గెస్ట్ టీవీ రియాలిటీ షో బిగ్ బ్రదర్ ఆధారంగా స్పెయిన్‌లో ‘గ్రాన్ హెర్మానో’ షో టెలికాస్ట్ అవుతోంది. 2017లోని సీజన్‌లో స్పానిష్ నటి కార్లోటా ప్రాడో పాల్గొంది. ఆ హౌస్‌లోకి ఆమె ప్రియుడు జోస్ మారియా లోపెజ్ కూడా వచ్చాడు. వీరిద్దరూ ప్రేమగా, ఆప్యాయంగా కలిసి మెలిసి ఉండే వారు. ఇదిలా ఉండగా ఓ నాడు ఇంటి సభ్యులంతా గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. అందరూ మద్యం సేవించి మత్తులో ఎక్కడి వారక్కడే స్పృహ లేకుండా పడి పోయారు.
ఈ క్రమంలో కార్లోటాపై ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. దీంతో షో నియమాలు ఉల్లంఘించిన కారణంగా మారియా లోపెజ్‌ను షో నుంచి పంపించేశారు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కార్లోటాను ఓ గదిలోకి పిలిపించి కెమెరాల్లో రికార్డైన అత్యాచార వీడియోను చూపించారు. అది చూసి స్థానువైపోయిన కార్లోటా..ఆపండి.. ప్లీజ్.. నావల్ల కాదు, దయచేసి ఆపేయండి అంటూ చేతులెత్తి వేడుకుంది. రోదిస్తున్న హృదయంతో, కన్నీళ్లతో అర్తించింది. అయినా సరే, షో నిర్వాహకులు ఆ రాత్రి తనపై అత్యాచారం జరిగిన పుటేజీలను ఆమెకు చూపించారు.
షో యాజమాన్యం బాధితురాలి అత్యాచార వీడియోను టెలికాస్ట్ చేయలేదు కానీ బయటకు లీకవకుండా కాపాడలేక పోయింది. పైగా వీటిని కొన్ని కంపెనీలు ప్రచారం కోసం యాడ్స్‌లో వాడు కోవడం సిగ్గు చేటు. దీనిపై అక్కడి ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిందితుడిని శిక్షించాలని, అంతే కాక నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దారుణానికి దారి తీసిందంటూ షోపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. రేపు ఏం తీర్పు చెబుతుందనే దానిపై అక్కడి జనం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి