ఈ లోకం మహిళలకు శాపం
లోకం తనదారిన తాను వెళుతోంది. తరతరాలుగా ఈ ప్రపంచం మారుతూ వచ్చినా, ఎంతో అభివృద్ధి సాధించినా, సాంకేతిక పరంగా మార్పులు చోటు చేసుకున్నా మహిళల పట్ల పురుషుల ఆలోచనల్లో, వాళ్ళ ప్రవర్తనలో మార్పులు రావడం లేదు. ఇది సభ్య సమాజం మొత్తం తలొంచు కోవాల్సిన పరిస్థితి. ఇదిలా ఉండగా తాజాగా ప్రపంచ ఆరోగ్య సమస్థ మహిళలు, బాలికలు, చిన్నారులపై వరల్డ్ వైడ్ గా శారీరకంగా, మానసికంగా వేధింపులకు లోనవుతు న్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
మహిళలపై జరుగుతున్న హింస మానవ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. వారిపై వివక్ష చూపడమేనని తెలిపింది. స్త్రీలను గౌరవించడం, వారిపై హింసను నిరోధించడంపై డబ్ల్యూహెచ్‌వో ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. మహిళల భద్రతకు మొదటి స్థానం కల్పించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వారికి ఎలాంటి హాని చేయ కూడదని హితవు పలికింది. వారి గోప్యతను కాపాడాలని, భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేసింది. వారిపై ఏ మాత్రం వివక్ష చూపించొద్దని కోరింది. అందు కోసం కార్యక్రమాలను రూపొందించాలని పేర్కొంది. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పేర్కొంది.
మహిళల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ఓ విధానం తీసుకు రావాలని సూచించింది. స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తు తున్నాయని తెలిపింది. దీనివల్ల సమాజ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని, కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులు, ఇతర మైనారిటీ మహిళలు, వైకల్యాలున్న స్త్రీలు అనేక రకాల హింసలకు గురవుతున్నారు.
38 నుంచి 50 శాతం మహిళల హత్యలు వారి సన్నిహితుల ద్వారానే జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు సామాజిక, ఆర్థిక, కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. హింస నుంచి బయట పడిన మహిళల్లో దాదాపు 55 శాతం నుంచి 95 శాతం మంది వరకు ఆ సంఘటనను బయటకు చెప్పడానికి ముందుకు రావట్లేదు. పురుషుల అక్రమ సంబంధాలు కూడా అనేక సార్లు మహిళలపై హింసకు కారణంగా నిలుస్తున్నాయి. లైంగిక హింస మహిళలకు తీవ్రమైన శారీరక, మానసిక, లైంగిక, పునరుత్పత్తికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
గర్భం దాల్చడం, ప్రేరేపిత గర్భస్రావం, హెచ్‌ఐవీ సహా పలు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. లైంగిక వేధింపులకు గురైన మహిళల్లో ఇలాంటి వ్యాధులు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. గర్భస్రావం రెండింతలు ఎక్కువ. ఈ రకమైన హింస కారణంగా నిరాశ, ఒత్తిడి, నిద్రలేమి, ఆత్మహత్యా యత్నాలకు పాల్పడే ప్రమాదం ఉంది. తాగుడుకు బానిసలు అవుతారు. తలనొప్పి, వెన్నునొప్పి, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశముంది. హింస ఉన్న కుటుంబాల్లో పెరిగే పిల్లల్లో నేర ప్రవృత్తి ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు పలు సూచనలు చేసింది ఆరోగ్య సంస్థ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి