ఫీనిక్స్‌కు పెటా అవార్డు
వరల్డ్ వైడ్ గా మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న హాలీవుడ్ సూపర్ స్టార్. లక్షలాది మంది అభిమానుల ఆరాధ్య దైవం జోక్విన్ ఫీనిక్స్ కెరీర్లో అరుదైన పురస్కారం దక్కింది. ఆయన ఇటీవలే నటించిన జోకర్ సినిమా ప్రపంచాన్ని ఊపేస్తోంది. కోట్లాది డాలర్లు కురిపిస్తోంది. ఇదిలా ఉండగా జోకర్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ జోక్విన్ ఫీనిక్స్ పీపుల్స్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్ 2019 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు ఎంపిక అయ్యాడు. ప్రముఖ హాలీవుడ్ మేగజీన్ ది హాలీవుడ్ రిపోర్ట్ ప్రకారం, ఫీనిక్స్ మూడు సంవత్సరాల వయస్సు నుంచే శాకాహారిగా ఉన్నాడు.
స్వతహాగా జంతు ప్రేమికుడైన అతడు. 'వీగన్' ఆహార శైలికి అలవాటు పడి, దీర్ఘకాలం నుంచి జంతు హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇదే విషయాన్ని పెటా అధ్యక్షుడు ఇంగ్రీడ్ న్యూకిర్క్ ప్రస్తావిస్తూ. నిరంతరం జంతు హక్కుల కోసం పోరాడేందుకు ఎల్ల వేళలా ముందుండే వ్యక్తి జోక్విన్ ఫీనిక్స్ అని అన్నారు. జంతువుల సంరక్షణ కోసం ఎటువంటి సంకోచం లేకుండా పాటుపడే వ్యక్తి అని కొనియాడారు. కాగా వన్యప్రాణులను సర్కస్‌లో ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకు రావడం కోసం ఇటీవల పెటా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'వి ఆర్ ఆల్ ఎనిమల్స్' అనే కార్యక్రమంలో ఫీనిక్స్ పాల్గొన్నారు.
ఇక మత గురువు పోప్ ఫ్రాన్సిస్, అమెరికన్ టెలివిజన్ యాంకర్ ఓప్రా విన్‌ఫ్రే, అంజెలికా హస్టన్, ఒలివియా మున్, ఎవా మెండిస్, అలిసియా సిల్వర్‌స్టోన్ వంటి ప్రముఖులకు గతంలో 'పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డును దక్కించుకొన్నారు. ఇక మన దేశం తరపు నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటా-2019కు ఎంపికయ్యాడు. అయితే క్రికెట్ ప్రేమికులు, ఫ్యాన్స్ మాత్రం కోహ్లీని ప్రశంసిస్తున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి