ధోని ఆటగాడు కాదు మనసున్నోడు
ఇండియాలో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా పేరొందిన ఝార్ఖండ్ డైనమేట్, డైనమిక్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని ఏది చేసినా సంచలనమే. టీమిండియాకు ఎనలేని విజయాలు సాధించి పెట్టిన యోధుడిగా ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తు పెట్టుకుంటారు. ఎంత వత్తిళ్లు ఉన్నా సరే కూల్ గా తన పని తాను చేసుకుపోయే ఈ ఆటగాడు అంటే కోట్లాది మందికి చచ్చేంత ఇష్టం కూడా. వయసు పెరుగుతున్నా ఇంకా భారత జట్టుకు తన సేవలు అందజేస్తున్నారు. ఇండియా గెలుపులో ధోని కీలక పాత్ర పోషిస్తూనే అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటనల్లో అగుపిస్తూ కాసులు వెనకేసుకుంటున్నాడు. ఇప్పటికే ప్రపంచంలోని వంద మంది భారీ ఆదాయం కలిగిన ఆటగాళ్లలో మన ధోని కూడా ఒకడు. అంటే అర్థం ధోని ఆదాయం సగటున ఏడాదికి దాదాపు 100 కోట్లకు పైమాటే అన్నమాట.
తమ ఆటతో అభిమానుల మనసు దోచుకున్న క్రికెటర్లు ఎందరో ఉన్నారు. వారిలో మొదటగా చెప్పాల్సి వస్తే కపిల్ దేవ్, బ్రియాన్ లారా, అజహరుద్దీన్, ధోని, రాహుల్ ద్రావిడ్, స్టీవ్ వా లాంటి వాళ్ళున్నారు. అయితే చాలా మందికి అజ్జు భాయి అనే సరికల్లా మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రమే జ్ఞాపకం వస్తుంది. కానీ ఈ హైదరాబాదీ ఆటగాడు ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే గుప్త దానాలు చేస్తూ ఉంటాడు. పేద పిల్లలు, అనాధల కోసం ఎన్నో ఛారిటీ మ్యాచులు ఆడారు వీరంతా. వీరితో పాటు సచిన్ కూడా. ఇక మాజీ కెప్టేన్ ధోని రూటే సపరేట్. ఎక్కడ ఖాళీ సమయం చిక్కితే చాలు..ఆయన తన భార్యతో కలిసి పిల్లలతో గడుపుతారు. వారి కోసం తోచినంత సాయం చేస్తారు. తాజాగా ముంబైలో టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తో కలిసి ధోని చారిటీ మ్యాచ్ ఆడాడు.
రీతి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన మ్యాచ్ లో ధోని, కొరియో గ్రాఫర్ కేసర్ తో కలిసి ఆడాడు. అంతకు ముందు నటుడు అర్జున్ కపూర్ తో కలిసి ఎమ్మెస్ ధోని సరదాగా మరో చారిటి మ్యాచ్ ఆడాడు. దీని ద్వారా వచ్చే డబ్బులను సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. గత ఏడాది ఇదే నెలలో ముంబైలో ఫుట్ బల్ ఆడాడు ధోని. ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్, బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్ తో కలిసి ఫుట్ బాల్ ఆడుతూ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేశాడు. ఈ డైనమిక్ క్రికెటర్ కు ఫుట్ బాల్ ఆడడం అన్నా, వీలున్న సమయంలో ఆర్మీలో విధులు నిర్వహించడం అంటే చాలా ఇష్టం. అందుకే ధోని క్రికెటర్ మాత్రమే కాదు మనసున్నోడు కూడా. సో..వర్ధమాన ఆటగాళ్లు ధోనిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కదూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి