కళకళ లాడనున్న తిరుపతి రైల్వే స్టేషన్
ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన పుణ్యక్షేత్రంగా తిరుమల వినుతికెక్కింది. ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు ఆ శ్రీ వేంకటేశ్వరుడిని, పద్మావతి అమ్మ వార్లను దర్శించుకుంటారు. దేశం నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. నిత్యం బస్సుల్లో, వాహనాల్లో, రాళ్ళల్లో, విమానాళ్ళల్లో ప్రయాణం చేస్తూనే ఉంటారు. రోజు రోజుకు రద్దీని తట్టు కోవడం కష్టంగా మారింది. అన్నిటికంటే రైల్వే శాఖ రోజూ వేలాది మందిని ఈ పుణ్య క్షేత్రం కోసం రైళ్లు నడుపుతోంది. అయినా రైళ్లు సరి పోవడం లేదు. జనాభా పెరగడం తో పాటు రోజూ తిరుమలను దర్శించుకునే వారిలో భక్తులు అనూహ్యంగా పెరిగి పోతున్నారు. వారికి వసతి సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. వేలాది మంది సిబ్బంది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహిస్తూనే ఉన్నారు.
అయినా ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉచితంగా, నామ మాత్రం ఫీజులతో వసతులు కల్పిస్తున్నా అవి కూడా సరిపోవడం లేదు. దీంతో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు రేల్వే శాఖను వేడుకుంటున్నారు. మెరుగైన సేవలు ఏర్పాటు చేయాలని, బడ్జెట్ లో నిధులు ఎక్కువగా కేటాయింపులు జరపాలని కోరుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తిరుమలకు పాలక మండలిని ఏర్పాటు చేసింది. అయినా ఫలితం కనిపించడం లేదు. భక్తులకు కష్టాలు తప్పడం లేదు. పిల్లలు, వృద్దులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు ప్రత్యేకంగా స్లాట్ ఏర్పాటు చేశారు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. తాజాగా వేలాది మంది ప్రయాణం చేసే తిరుమల రైల్వే స్టేషన్ ను రైల్వే శాఖ బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ సందర్శించారు. దీనిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
అంతకు ముందు తిరుపతి రైల్వే స్టేషన్ లో సెల్ ఫోన్స్ ఛార్జింగ్ యూనిట్లను యాదవ్ ప్రారంభించారు. అనంతరం రైల్వే శాఖ ఉన్నతాధికారులతో స్మార్ట్ రేల్వే ప్రాజెక్టుల పని తీరుపై సమీక్ష జరిపారు. ఇదే సమయంలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ చైర్మన్ ను కలిశారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వినతి పత్రాన్ని అందజేశారు. చంద్రగిరి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తే ఇప్పుడున్న సమస్యల నుంచి గట్టెక్కవచ్చని సూచించారు. ఈ సందర్బంగా బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ మాట్లాడారు. 300 కోట్ల తో తిరుపతి రైల్వే స్టేషన్ లో అదనపు ప్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు. త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, భూ సంబంధిత సమస్యలు ఉన్నాయని, అవి క్లియర్ అయిన వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు. మొత్తం మీద రైల్వే స్టేషన్ ఇక కళకళ లాడనుంది అన్నమాట.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి