ఇక నుంచి ఆరోగ్యాంధ్రప్రదేశ్
ఏపీ రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. అడిగితేనే ఇవ్వని పాలకులు ఉన్న ఈ రోజుల్లో అన్నీ అడగకుండానే ఇచ్చేస్తూ తాను మాటల సీఎం కానని, చేతల సీఎం అంటూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు సందింటి జగన్ మోహన్ రెడ్డి. పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఆయన, విద్య, వైద్యంపై ఎక్కువ దృష్టి సారించారు. ఈ దేశం లో దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ ఓ సంచలనం. 28 రాష్ట్రాల కన్నా మిన్నగా ఈ పథకం అమలు కావాలని జగన్ కోరారు. ఇందు కోసం వెయ్యి రూపాయలు వైద్య ఖర్చులు దాటితే ఈ పథకాన్ని వర్తింప చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఏపీలోని పశ్చిమ గోదావరిలో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టును.ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికామని చెప్పారు.
కొత్త సంవత్సరంలో మన ప్రభుత్వం ప్రారంభించిన రెండో కార్యక్రమం ఇది. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ఆరోగ్యశ్రీ సేవలు 2,059కి పెంచుతూ పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. ఇది అన్నింటికన్నా సంతృప్తిని ఇచ్చే కార్యక్రమం. ఇంతకు ముందు మహానేత రాజశేఖరరెడ్డి.. దేశ ఆరోగ్య చర్రితలోనే ఒక విప్లవాత్మక పథకంగా ఆరోగ్యశ్రీని ప్రవే శ పెట్టారు. పాదయాత్రలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నా. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ 1,059 రోగాలకు మాత్రమే పరిమితమైంది. మూడు నెలల పాటు ఈ పైలట్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఇదే సమయంలో మిగతా జిల్లాల్లో అదనంగా 200 రోగాలకు చికిత్సను విస్తరిస్తూ 1,259 వ్యాధులకు ఈ పథకం కింద చికిత్స అందిస్తాం.
రోగులకు మంచి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఎన్నికలప్పుడు చెప్పిన విధంగా ఏటా 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వస్తున్నాం. కోటి 42 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం. గ్రామ సెక్రటేరియట్‌లో ఉన్న మెడికల్ అసిస్టెంట్, పీహెచ్‌సీలో ఉన్న ఆరోగ్యమిత్రలు ఎవరికైనా ఏదైనా రోగం వస్తే ఎక్కడికి వెళ్లాలి, ఏ ఆసుపత్రిలో చూపించుకోవాలి అనే గైడెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 వేల నుండి 50 వేల మంది ఆశా వర్కర్లను గ్రామ సెక్రటేరియట్ పరిధిలోకి తీసుకువచ్చి వారికి 300, 350 ఇళ్లను కేటాయిస్తాం. ఈ ఇళ్లకు సంబంధించిన ఆరోగ్య బాధ్యతలు వారి చేతిలో పెడతామన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి