కామెంట్స్ కలకలం..ఆగని వైనం
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన కామెంట్స్ పాకిస్తాన్ క్రికెట్ లో కలకలం రేపాయి. తాను క్రికెట్ ఆడిన సమయంలో కనేరియాపై వివక్ష చూపెట్టారంటూ కుండబద్దలు కొట్టారు. ఇంకేం పాక్ ఆటగాళ్లు షోయబ్ పై విరుచుకు పడ్డారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇదే అంశంపై ఇండియన్ క్రికెటర్లు మద్దతు పలికారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. మియాందాద్,ఇంజమాముల్ , మహ్మద్ యూసఫ్, షాహిద్ అఫ్రిదిలు అక్తర్ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. కనేరియా హిందూ అనే కారణంగా ఎవరూ అవమానించ లేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఆ వివక్ష భారత్‌లో లేదా అంటూ కూడా అక్తర్‌ను ప్రశ్నించారు.
కామెంట్స్ చిలికి చిలికి గాలి వానగా మారాయి. దీంతో అక్తర్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. తాను ఏ సందర్భంలో, ఎందు కోసం అన్నానో ముందు తెలుసు కోవాలన్నాడు. తనపై వస్తున్న విమర్శలకు బాధ్యత వహిస్తూ సమాధానం కూడా ఇవ్వాల్సి ఉందన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మొత్తంగా మత వివక్ష ఉందని తాను అనలేదని, కేవలం ఒకరో, ఇద్దరో కనేరియాను హిందూ అనే కారణంగా చిన్న చూపు చూసేవారని మాత్రమే తాను పేర్కొనట్లు అక్తర్ తెలిపాడు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తూ మొత్తం పాకిస్తాన్ క్రికెట్‌లోనే మత వివక్ష ఉందనే విధంగా తాను అన్నట్లు ఆపాదించడం తగదన్నాడు.
గత కొన్ని రోజులుగా నా చుట్టూ పెద్ద వివాదాన్ని సృష్టించారు. దాన్ని నేను విన్నాను.. చూశాను కూడా. అది నాకు క్లియర్‌గా అర్థమైంది. అందు కోసమే మరొకసారి మాట్లాడుతున్నా. ఇక విమర్శలు ఆపుతారనే యూట్యూబ్ ద్వారా వివరణ ఇస్తున్నా. నేను యూట్యూబ్ చానల్‌ను ఆరంభించడానికి కారణమే క్రికెట్ టాక్ ద్వారా కేవలం వినోదాన్ని పంచడానికి మాత్రమే కాదు..మన సమాజంలో అభివృద్ధికి సంబంధించి కూడా చెబుతూ ఉంటా. పాక్ క్రికెట్ కల్చర్‌లో ఒక రాయ బడలేని ఒప్పందం ఏదైనా ఉందంటే అది మనం ఒకరి నొకరు గౌరవం ఇచ్చి పుచ్చు కోవాలనే సంగతి.
కాక పోతే కొంత మందిలో అలా గౌరవం ఇచ్చి పుచ్చు కోవడంలో సంశయం కనబడుతోంది. ఇది మన జట్టు కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా కాదు.. వివక్ష చూపెట్టారని నేను చెప్పింది.. ఒకరో ఇద్దరో క్రికెటర్ల గురించి మాత్రమే చెప్పా. ఆ బ్లాక్ షీప్స్ ప్రతీ చోట ఉండవచ్చు. అది పాకిస్తానా, ఇండియానా, ఇంగ్లండా, ఐర్లాండా అనేది సమస్య కాదు. దీనికి ఇక్కడితోనైనా ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నా అ షోయబ్ స్పష్టం చేశాడు. ఈ వివరణతోనైనా షోయబ్ పై ఆరోపణలు ఆగుతాయో చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి