నెట్టింట్లో పేపర్ బాయ్ హల్ చల్..!
పేపర్ బాయ్ అంటే ఇదేదో తెలుగు సినిమా ఆనుకుంటే పొరపాటు పడినట్లే . పట్టుమని 19 ఏళ్ళు కూడా నిండని ఆ యువకుడి మదిలో మెదిలిన ఐడియా ఇవ్వాళ అంతర్జాలంలో హల్ చల్ చేసేస్తోంది. ఒక్కో స్టార్ట్ అప్ ఒక్కో బ్రాండ్ ఇమేజ్ ను స్వంతం చేసుకుంటూ కంపెనీలుగా ఎదుగుతున్నాయి. నిప్పులు చిమ్ముకుంటూ నేనెగిరి పోతే నిబిడాక్షర్యంతో మీరే మీరే అంటూ మహాకవి శ్రీ శ్రీ ని గుర్తుకు తెస్తున్నాడు బెంగళూర్ కు చెందిన వెంకట్ కార్తీక్ రాజా. ఇదే వయసు కలిగిన యువకులంతా సోషల్ మీడియాలోనే లేదా స్మార్ట్ ఫోన్స్ లలో బూతు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటే ఇతను మాత్రం పది మందికి దారి చూపించేలా కత్తి లాంటి ఆలోచనను ఆచరణలోకి తీసుకు వచ్చాడు. ఎక్కడా టైం ను వేస్ట్ చేయకుండా తాను ఏది అనుకున్నాడో అదే చేశాడు. సక్సెస్ అయ్యాడు. పొద్దున్న లేస్తేనే చాలా మంది ఇళ్లల్లోకి వచ్చే పేపర్లన్నీ వేసేది పిల్లలే. అందుకే మనోడు తన విన్నూతమైన ఐడియాకు పేపర్ బాయ్ అని పేరు పెట్టాడు.
ఏదైనా సాధించాలన్నా, లేదా ఇతరులకంటే భిన్నంగా బిజినెస్ లో రాణించాలన్నా మన ప్రోడక్ట్ పేరు అందరికీ అర్థమయ్యేలా, త్వరగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అదే ఒక బ్రాండ్ ను క్రియేట్ చేస్తుంది. అందరిలాగే తనకు న్యూస్ చదవడం, స్టోరీస్ చూడటం అలవాటు. ఒక్క పేపర్ అయితే పర్వాలేదు ..మరి ఇంకొన్ని పేపర్స్ కావాలంటే మళ్ళీ కొంత దూరం నడవాలి, డబ్బులు ఖర్చు చేయాలి. తీరా అన్నీ చదవాలాంటే టైం ఉండాలి. ఇంత చేసినా ఒక్కోసారి సంతృప్తి అంటూ ఉండదు. పేపర్స్, మ్యాగజైన్స్ అన్ని భాషల్లో ఉన్నవన్నీ ఈజీగా, నిమిషాల్లో చదుకునేలా ఉంటే ఎలా ఉంటుంది అన్న మెరుపులా ఆలోచన మెరిసింది. ఇంకేం కొన్ని రోజుల పాటు నిద్ర లేని రాత్రులు గడిపాడు కార్తీక్ రాజా. రాజకీయాలు, బిజినెస్ , ఎంటర్ టైన్మెంట్ , స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్ నేషనల్ , మూవీస్ ఇలా ఏది తెలుసు కోవాలన్నా పేపర్స్, మ్యాగజైన్స్ మీద ఆధార పడాల్సిందే. అన్నీ అర చేతిలో ఇమిడి పోతే ఎలా ఉంటుందో అన్న ఐడియానే పేపర్ బాయ్ యాప్. డిజిటల్ మీడియాలో అదో అద్భుతాన్ని సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 400 కు పైగా దిన, వార పత్రికలను అందుబాటులోకి తీసుకు వచ్చాడు కార్తిక్ .
ఒకే ఒక్క యాప్ వందలాది పేపర్స్, మ్యాగజైన్స్ ను కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యేలా చేసాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా తమకు తోచిన సమయంలో చదువుకోవచ్చు. అతనికి వచ్చిన ఆలోచనను ముందుగా తల్లిదండ్రులతో పంచుకున్నాడు. వారు అతడిని సపోర్ట్ చేశారు. కేవలం ఇద్దరితో పేపర్ బాయ్ ని స్టార్ట్ చేశాడు. ప్రారంభామైన కొన్ని రోజుల్లోనే వేలాది మంది చూడటమే కాదు పేపర్ బాయ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో అతడి పేరు బెంగళూర్ లో మారు మోగింది. ఇప్పటికే ఈ యాప్ ఐఓఎస్ , ఆండ్రాయిడ్ వెర్షన్లో ఉంది. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు మిగతా కంపెనీలు దృష్టి పెట్టాయి. మొత్తం మీద చిన్నపాటి ఆలోచన 50 మందికి నీడనిస్తోంది. కాసులు కురిపించేలా చేస్తోంది. వాట్ ఏ ఐడియా కదూ. గెలుపు అంటే అందరిలా ఆలోచిండం కాదు భిన్నమైన దారిలో వెళ్లడం అంటాడు కార్తిక్ నిజం కదూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి