జియోకు వోడా ఝలక్
టెలికాం రంగంలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. ఇప్పటికే అంతా ఫ్రీ అంటూ కోట్లాది మంది కస్టమర్లను బురిడీ కొట్టించిన రిలయన్స్ జియో కంపెనీ, ఆదాయం సమకూరాక నెత్తిన శఠగోపం పెట్టింది. ఉచితం అంటూనే మరో వైపు ఇతర నెట్ వర్క్ టెలికాం కంపెనీలకు కాల్స్ చేసే సదుపాయాన్ని తొలగిస్తున్నట్లు ఆర్ఐఎల్ కంపెనీ ప్రకటించింది. దీంతో నిన్నటి దాకా ఫ్రీ డేటా పేరుతో ఫుల్ ఎంజాయ్ చేసిన వినియోగదారులు ఇప్పుడు అంబానీ సోదరులపై నిప్పులు చెరుగుతున్నారు. తమను నిలువునా మోసం చేశారంటూ మండిపడుతున్నారు. వోడా ఫోన్ , ఐడియా, టాటా , ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్ కంపెనీలు ప్రస్తుతానికి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ జియో ఒక్కటే ఇలా వినియోగదారులపై అదనపు చార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా దేశీయ అతిపెద్ద టెలికాం దిగ్గజ కంపెనీగా ఉన్న మరో కంపెనీ వొడాఫోన్ ఐడియా జియోకు షాకిచ్చింది. ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్ ను వసూలు చేస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించిన కొద్ది గంటలకే వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చింది. జియో చార్జీల వడ్డనతో కస్టమర్లను ఆగ్రహం తెప్పిస్తే వొడాఫోన్ ఐడియా మాత్రం కస్టమర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. తన వినియోగదారులకు ఇతర నెట్ వర్క్ కాల్స్ కోసం విడిగా బిల్లింగ్ చేసే ఉద్దేశం తమకు లేదని ప్రకటించింది. ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ చేసే కాల్స్ ఏ నెట్ వర్క్‌కు అయినా ఉచిత మేనని తెలిపింది. వినియోగదారులపై భారం పడ కూడదనేది తమ లక్ష్యమని వెల్లడించింది. అంతేకాదు, ఐయూసీ ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడం తొందరపాటు చర్య అని పేర్కొంది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన రెగ్యులేటరీ డెఫినేషన్ ప్రకారం ఐయూసీ ఛార్జీలు మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాల్సిన విషయాలని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. తమ కస్టమర్లు చేసే ప్రతి కాల్‌కు ఛార్జీలు పడతాయా లేక ఉచిత కాల్స్ చేస్తున్నామా అని అయోమయానికి గురికావాల్సిన అవసరం లేకుండా చేయడమే తమ ఉద్దేశమని తెలిపింది.వొడాఫోన్ ఐడియా ఇండియా అంతటా వినియోగదారులకు 2జీ, 3జీ, 4జీ సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. 50 శాతం కంటే ఎక్కువ మొబైల్ వినియోగదారులు తమ ఫీచర్ ఫోన్లలో 2జీ నెట్‌వర్క్‌నే ఉపయోగిస్తున్నారని తెలిపింది. మొత్తం మీద వోడా..ఐడియా కంపెనీ డిసిషన్ తో నైనా రిలియన్స్ గ్రూప్ కంపెనీ తన నిర్ణయం మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి