ముద్దుల మురిపెం..సరస సల్లాపం ..!
జీవితం అన్నాక కాస్తంత రిలీఫ్ లేకపోతే..వుండీ అర్థం ఏముంటుందని..? ఓ ముద్దు ముచ్చట లేకపోతే శరీరం అలసటకు లోనవుతుంది. ఏదో కోల్పోయినంత బాధ కలుగుతుంది. లోకంలో స్త్రీ పురుషుల మధ్య ఉన్నంత కనెక్టివిటీ ఇంకే జీవరాశుల్లో లేదు. అందుకే ఇంతటి ఆకర్షణ. ఒకరిపై మరొకరి మమకారం. అన్నింటికంటే ఎక్కువగా అర్థం చేసుకోవడం. అతడు సినిమాలో మహేష్ బాబు..త్రిషల మధ్య పండిన కెమిస్ట్రీ ఎందరినో ఆకట్టుకునేలా..మళ్లీ మళ్లీ జ్ఞాపకం తెచ్చుకునేలా చేసింది. ఊహల్లో విహరించడం మనకు ఎక్కువగా అలవాటు. ఆ ఊహే ..ఆ ఆలోచనే లేక పోతే లైఫ్ బోర్ కొడుతుంది. ఈ ప్రయాణం వేస్ట్ అనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా..తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది.
తన కోసం వేచి చూడటం. సినిమా టాకీసుల వద్ద..బస్టాండ్..రైల్వే స్టేషన్ వద్ద నిలిచి వుండటం.. సాయంత్రమైతే బయటకు వస్తుందేమోనన్న ఆరాటం. ఇదంతా రక్త మాంసాలు కలిగిన స్పందించే హృదయం కోసం మరో మనసు పడే తపన..నిరీక్షణ. ఎవరికి వారు ..ఎవరి లోకంలో వాళ్లు నటిస్తున్నారంతే..చూస్తే అంతా ఒక్కరే..తరిచి చూస్తే ఒకరిలో ఎన్నో ముఖాలు..మరెన్నో ఈర్ష్యా ద్వేషాలు. ప్రేమలేఖలు..పోస్ట్ మ్యాన్ పిలుపులు..ఎవరైనా చూస్తారేమోనని దొంగతనంగా గోడ వారగా..తలుపు సందుల్లోంచి చూడటం..ఆ ఒక్క ఛాన్స్ మిస్సవుతే..సాయంత్రమో లేదా ఇంకే సమయంలోనైనా కనీసం ఏ టాకీసు వద్ద నైనా కనిపిస్తుందేమనని చిన్నపాటి కోరిక.
పక్కన నువ్వుంటే ప్రపంచం వద్దనిపిస్తుంది. నువ్వు లేకపోతే కాసింత సంతోషం దూరమవుతుంది..ఇదేనేమో ప్రేమంటే..అది చేసే మ్యాజిక్..జిమ్మిక్కు ఇంకెందులోనూ దొరకదు. కాలాలు మారినా..తరాలు గడిచినా..టెక్నాలజీ విస్తరించినా..ఇంటర్నెట్ వేగం పెరిగినా..గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమను ఏ పరికరమూ..ఏ సాధనమూ కనుక్కోలేక పోయాయి. డాక్టర్లు, సైంటిస్టులు..రీసెర్చ్ స్కాలర్స్ ..ఇన్వెంటర్స్..ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు..ప్రేమలో ఉన్న గమ్మత్తు ఏమిటో తెలుసుకునేందుకు..అలా అయితే ఇంతలా చర్చ ఎందుకు..? మొదటిసారి చూసినప్పుడు..రెండోసారి కలుసుకున్నప్పుడు..ఆఖరున వెళ్లి పోతున్నప్పుడు..విశ్వనాథ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. బాలచందర్ సినిమాలోని కేరక్టర్స్ వెంటాడుతాయి.
కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడటం..చేతుల్ని గోముగా నిమరడం..ఇవ్వన్నీ మామూలే. కళ్లు విప్పారినప్పుడు..చూపులు ప్రాణం పోసుకుంటాయి. ఎక్కడలేనంతటి శక్తి మనల్ని ఆవహిస్తుంది. ఇదేనేమో బంధమంటే..భావోద్వేగాలలో ఇద్దరూ ఒక్కటైనప్పుడు..ఏకమై ఆలోచిస్తున్నప్పుడు చెప్పలేనంత ఆనందం..ఏదో శక్తి మనల్ని వెన్నుతట్టి తడుతుందేమోనన్న కాసింత ఫీలింగ్ ఓ చోట నిమ్మళంగా వుండనీయదు. అందరి ఆలోచనలు ఒకేలా వుంటాయి..కాస్తంత తేడా ఏమిటంటే కళాకారులు , క్రియేటివిటీ కలిగిన వాళ్లు కొంచెం భిన్నంగా ఆలోచిస్తారంతే..అక్కడే కొంచెం తేడా. ఎంత సంపాదించినా..ఇంకెంతగా ఆస్తులు పోగేసుకున్నా..ఎక్కడో ఒక చోట ..వున్నట్టుండి ప్రేమించాలనిపిస్తుంది..గుండెల్లో దాచుకోవాలనిపిస్తుంది.
అన్నీ వున్నా ఏమీ లేక పోయినా..హృదయంలో కాస్తంత ప్రేమ వుంటే చాలు..ఎన్నేళ్లయినా బతికేయొచ్చు. మనలాగే ఆలోచించే వాళ్లు..జర్నీలో ఎప్పుడో ఒకసారి తారసపడతారు. అప్పుడు అనిపిస్తుంది..ఇలాంటి వ్యక్తయితే ..మనతో పాటే వుంటే ..బావుండనిపిస్తుంది..కట్టుబాట్లు అడ్డొస్తాయి. సంస్కారం హెచ్చరిస్తుంది. కొన్నేళ్ల పాటు కాపాడుకుంటూ వస్తున్న నైతికతకు భంగం వాటిల్లుతుంది..ప్రేమ దూరమవుతుంది. మనసు చెరసాలగా మారిపోతుంది. లైఫ్ మోయలేనంత బరువు అనిపిస్తుంది.
సో..సంతోషం కావాలన్నా..ఆనందం దక్కాలన్నా..జస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవడమో లేదా ..నేచర్ తో మమేకం కావడమో చేస్తే చాలు..అంతా హాయిగానే వుంటుంది..పోతే..ముద్దుల మురిపెం మురిపిస్తుంది..చిన్నపాటి స్పర్శ ఒక తరానికి కావాల్సినంత కిక్ ఇస్తుంది..ఇదేనేమో ప్రేమంటే..ఇలాగే వుండి పోమంటే..అంటూ పాడుకుంటూ వుండిపోవడమే..అమితాబ్ ..రేఖ ..కమల్ హాసన్..జయప్రద..అక్కినేని..సావిత్రి..లు గుర్తుకు వస్తారు. ప్రేమకున్న పవర్ ఏమిటో తెలిసేలా చేస్తారు..తేరే మేరే బీచ్ మే ..కైసాహే బంధన్..అంటూ పాడుకుంటూ పోవడమే..కదూ..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి