మోస్ట్ పాపుల‌ర్ బ్రాండ్‌గా రిల‌య‌న్స్ జియో

ఇండియా అంటే క్రికెట్ ఎలాగా..ఇపుడు భార‌తీయ ఖ్యాతిని ఖండంత‌రాల‌లో వెలిగి పోయేలా చేసిన ఘ‌న‌త ముఖేష్ అంబానీ అండ్ టీందే. ఇండియ‌న్స్ కు ఏమీ చేత కాద‌ని విర్ర‌వీగుతున్న అమెరికా, దాని మిత్ర దేశాలకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది జియో. ప్ర‌పంచ టెలికాం రంగంలో ఇదో అద్భుత‌మైన రికార్డును స్వంతం చేసుకుంది. ప్రారంభించిన కొద్ది కాలంలోనే టెలికాం మార్కెట్‌లో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌కు చేరుకుంది. ఏ ముహూర్తంలో ప్రారంభించారో కానీ..ఇండియా అంత‌టా విస్త‌రించింది. త‌క్కువ ఖ‌ర్చుకే మొబైల్ ఉండాల‌ని, ప్ర‌తి సామాన్యుడి చేతిలో త‌న కంపెనీ లోగోతో పాటు ఫోన్ ఉండాల‌న్న త‌న తండ్రి అంబానీ క‌ల‌ల‌ను కొడుకు సాకారం చేశారు.

ఇపుడు ఎక్క‌డ చూసినా..ఎక్క‌డికి వెళ్లినా జియో కంపెనీనే క‌నిపిస్తోంది. ఫోన్ల‌తో పాటు నెట్ క‌నెక్ష‌న్ , వాయిస్ కాల్స్, ఇలా ప్ర‌తి యాక్సెస‌రీని రూపొందించింది ఈ కంపెనీ. మొద‌ట్లో లైట్‌గా తీసుకున్నాయి ప్ర‌త్య‌ర్థి కంపెనీలు. ఇండియ‌న్ టెలికాం ఇండ‌స్ట్రీలో తిరుగులేని ఆధిక్య‌త‌ను క‌లిగి వున్న ఎయిర్ టెల్ కంపెనీకి చుక్క‌లు చూపించింది జియో. ఇప్ప‌టికే 5 కోట్ల మందికి పైగా జియోలో స‌భ్యులై పోయారు. ప్ర‌తి భార‌తీయుడు అప‌రిమిత‌మైన ఆనందాన్ని జియో ద్వారా పొందుతున్నారు. అన్ లిమిటెడ్ యాక్సెస‌బిలిటీ, మొబైల్ పోర్ట‌బిలిటీ, జియోల పేరుతో వెలిసిన స్టోర్స్ కిట‌కిట‌లాడుతున్నాయి

క‌స్ట‌మ‌ర్ల‌తో. భారీ ఆఫ‌ర్లు, బిగ్ డిస్కౌంట్ల‌తో రోజుకో కొత్త నిర్ణ‌యంతో మిగ‌తా టెలికాం కంపెనీల‌కు కునుకే లేకుండా చేస్తోంది జియో. బిగ్గెస్ట్ మొబైల్ ఆప‌రేటర్‌గా ప్ర‌పంచంలో అవ‌త‌రించింది. ముంబై కేంద్రంగా ప్రారంభ‌మైన ఈ కంపెనీకి న‌మ్మ‌క‌మైన ..సుశిక్షుతులైన సైనికుల బృందం వుంది. ముఖేష్ అంబానీ ఏది ప‌ట్టుకున్నా అది బంగార‌మ‌వుతోంది. ఏ వ్యాపార‌మైనా స‌రే లాభాల్లో దూసుకెళుతోంది. భార‌త సంచార్ నిగం లిమిటెడ్ ను కూడా వెన‌క్కి నెట్టేసి ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. తాజాగా ఇండియాలో ఏ కంపెనీ పాపుల‌ర్ బ్రాండ్‌గా ఉందో చూస్తే..ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వాస్త‌వం వెలుగు చూసింది.



ఏకంగా అమెరికా సెర్చింగ్ కంపెనీ గూగుల్ త‌ర్వాత మోస్ట్ పాపుల‌ర్ బ్రాండ్ గా రిల‌య‌న్స్ జియో ఉంద‌ని ఇప్ సోస్ అనే సంస్థ తాజాగా చేసిన ప‌రిశోధ‌న ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. జియోకు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి కంపెనీగా భావించే ఎయిర్ టెల్ ఎనిమిదో స్థానంతో స‌రి పెట్టు కోవాల్సి వ‌చ్చింది. మూడో స్థానంలో పేటీఎం, 4వ స్థానంలో ఫేస్ బుక్, 5వ స్థానంలో అమెజాన్ , 6వ స్థానంలో శాంసంగ్, 7వ స్థానంలో మైక్రోసాఫ్ట్, 8వ స్థానంలో ఎయిర్ టెల్, 9వ స్థానంలో ఫ్లిప్ కార్ట్, 10వ స్థానంలో ఆపిల్ సంస్థ‌లు ఉన్నాయి. టాప్ 10 టాప్ బ్రాండ్‌ల‌లో 4 ఇండియాకు చెందిన కంపెనీలు ఉండ‌టం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!