మృదు మధురం..శృతి రాగం
భారతదేశంలో అరుదైన నటుడిగా పేరున్న నట దిగ్గజం కమల్ హాసన్ గారాల పట్టి, ముద్దుల కూతురు శృతి హాసన్ నటిగానే కాదు గాయనిగా కూడా రాణిస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించారు. ఇటీవల ఆమె ప్రిన్స్ మహేష్ బాబుతో నటించిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. తాజాగా ఓ హాలీవుడ్ సినిమాను ప్రాంతీయ భాషల్లోకి దబ్ చేస్తున్నారు. దానిలో మన శృతి డబ్బింగ్ చెప్పడంతో పాటు కొన్ని పాటలు పాడింది. ఆ సినిమా హాలీవుడ్ కు చెందింది. అన్నా, ఎల్సా అనే అక్కా చెల్లెళ్ళ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ మూవీ పూర్తి గా యానిమేషన్ తో రూపొందించారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు డిస్నీ సంస్థ ప్రతినిధులు. ఫ్రోజెన్ 2 హిందీ వెర్షన్‌కు ప్రియాంకా చోప్రా, పరిణీతి చోప్రాలు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో నిత్యామీనన్ ఈ పనిని పూర్తి చేసింది. తమిళ వెర్షన్‌లో ఎల్సా పాత్రకు హీరోయిన్ శ్రుతీ హాసన్ డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు స్వతహా గానే గాయని, సంగీత దర్శకురాలైన శ్రుతీ హాసన్ ‘ఫ్రోజెన్ 2’ తమిళ వెర్షన్ కోసం మూడు పాటలు కూడా ఆలపించారు.
ఈ విషయం గురించి శ్రుతీహాసన్ తన అభిప్రాయాలను పంచుకుంది. అన్నా, ఎల్సాల మధ్య ఉండే అనుబంధం నన్ను కట్టి పడేసింది. అందుకే మనసు పెట్టి చేశా. ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పాను. అన్నా, ఎల్సాల బంధం నా చెల్లి అక్షరా హాసన్‌కు, నాకు ఉన్న రిలేషన్షిప్ లా అనిపించింది. ఎల్సా పాత్ర ప్రతి అమ్మాయికి రోల్ మోడల్‌లా ఉంటుంది అని అన్నారు శ్రుతి. ‘ఫ్రోజెన్ 2’ చిత్రం త్వరలో దేశ మంతటా విడుదల కానుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి