చూడ ముచ్చట..ఒక్కటైన జంట
జీవితాన్ని వెలిగించే సాధనాల్లో పెళ్లి ఒక గొప్ప జ్ఞాపకం. అంతకంటే గొప్ప అనుభవం..తెలియని అనుభూతి. ప్రతి ఒక్కరు కొత్త ప్రపంచంలోకి వెళ్లే అరుదైన సన్నివేశం వివాహం. రెండు కుటుంబాలు, మనసుల మధ్య బంధం అనేది కలకాలం గుర్తు పెట్టుకోవాల్సింది. అందరూ పెళ్లి చేసుకుంటారు. కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం హిస్టరీ క్రియేట్ చేస్తాయి. ఇలాంటి అద్భుతమైన వివాహం, సన్నివేశం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. భారత క్రికెట్ లో జగమెరిగిన క్రికెటర్ గా పేరున్న వ్యక్తి మహమ్మద్ అజహరుద్దీన్. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరొకరు టెన్నీసా స్టార్ గా పేరున్న సానియా మీర్జా. ఈ రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. అది మ్యారేజీ రూపంలో.
అజహారుద్దీన్ కుమారుడు ..సానియా మీర్జా చెల్లెలు ఒక్కటయ్యారు. ఈ వివాహం కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అజహరుద్దీన్ తనయుడు అసద్‌తో ఆనం మీర్జాతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వంకాయ రంగు లెహెంగా ధరించిన ఆనం, పక్కనే అసద్ బంగారు రంగు షెర్వానీ ధరించి నిలుచుని ఉన్న ఫోటోలను ఆనం తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. వారిద్దరు కలసి ఉన్న చిత్రానికి మిస్టర్ అండ్ మిసెస్ అంటూ హ్యష్ ట్యాగ్‌ను జత చేసి పోస్ట్ చేశారు ఆనం మీర్జా.
ఇక ఆనం షేర్ చేసిన తన వివాహ వేడుక ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ కొత్త జంటను చూసి నెటిజన్లంతా ఫిదా అవుతూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఇక పెళ్లి కూతురు డ్రెస్‌లో ఉన్న ఆనంను చూసి చాలా అందంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే సానియా తన సోదరి మెహందీ, ప్రీ వెడ్డింగ్ వేడుక ఫోటోలను కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. మెహందీ వేడుకలో సానియా నల్లటి, ఎరుపు రంగు దుస్తులను ధరించగా..ఆమె సోదరి కలర్ ఫుల్ లెహెంగాలో కలిసి దిగిన ఫోటోలో వారిద్దరు ఎంతో అందంగా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తం మీద ఈ పెళ్లి భాగ్యనగరపు సంస్కృతిని తెలియ చెప్పింది.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి