మోగనున్న పెళ్లి బాజా.. ఒక్కటవనున్న ఆనం..అసద్..!

ప్రపంచంలో ఇద్దరు దిగ్గజ ప్లేయర్స్ కు కేరాఫ్ గా నిలిచింది అందమైన భాగ్యనగరం. వీరెవ్వరో కాదు ఒకరు టీమిండియా జట్టుకు మాజీ సారథి, ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజహరుద్దీన్ కాగా మరొకరు ప్రపంచ టెన్నిస్ స్టార్, అందమైన క్రీడాకారిణి సానియా మీర్జా. ఈ రెండు కుటుంబాల మధ్యన దాదాపు కొన్నేళ్ల బంధం ఇమిడి ఉన్నది. అజారుద్దీన్ కు ఇద్దరు కొడుకులు. అయితే ఒక బాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇదిలా ఉండగా అజ్జు భాయ్ కొడుకు అసదుద్దీన్..సానియా మీర్జా చెల్లెలు ఆనమ్‌మీర్జా  ఏడాదిగా ప్రేమించుకుంటూ ఉన్నారు. త్వరలో వీరిద్దరికి పెళ్లి జరగనున్నది. ఈ రెండు ఫ్యామిలీస్ హైదరాబాద్ లో ఏకంగా షాపింగ్ చేస్తూ సందడి చేస్తున్నారు.

వచ్చే డిసెంబర్ నెలలో షాదీ జరిపించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. మొదట నేనే ఆనమ్‌మీర్జా కు ప్రపోజ్ చేశా. ఇద్దరి మధ్య బాండింగ్ కొన్నేళ్లు సాగింది అని చెప్పాడు అసదుద్దీన్. ఆమె ఆలోచించకుండానే ఒకే చెప్పిందని తెలిపారు. తన తండ్రి లాగానే అసదుద్దీన్ కూడా బెస్ట్ క్రికెట్ ప్లేయర్ గా ఉన్నాడు.  ప్రస్తుతం వీరిద్దరి గురించిన ప్రేమ వ్యవహారం హైదరాబాద్ లో హల్ చల్ గా మారింది. ఈ జంట ఎప్పుడు ఒక్కటవు తుందంటూ సామాన్యుడి నుంచి స్పోర్ట్స్, కార్పొరేట్‌ దిగ్గజాల వరకు ఎదురు చూస్తున్నారు. అయితే ఆనమ్‌ మీర్జాకు 2016లో అక్బర్‌ రషీద్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. రెండేళ్ల పాటు కలిసి ఉన్న వీరు 2018లో విడాకులు తీసుకున్నారు.

లైన్ క్లియర్ కావడంతో వీరి పెళ్ళికి ఇక ఆటంకాలు అంటూ లేక పోవడం తో ఏర్పాట్లలో మునిగి పోయారు. కాగా అజహరుద్దీన్, సానియా మీర్జా కుటుంబాలు ఇప్పటి నుంచే షాపింగ్ లో మునిగి పోయాయి. ఇదిలా ఉండగా అసదుద్దీన్ కు ఇక్కడ రంజీలో ఆడే ఛాన్స్ దొరకలేదు. గత ఏడాది గోవాలో జరిగిన రంజీలో అసదుద్దీన్‌ ప్రాతినిధ్యం వహించాడు. అసదుద్దీన్‌కు ఆల్‌రౌండర్‌గా మంచి పేరు ఉంది. ఇక ఆనమ్‌ మీర్జా మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌. సిటీలోని టాప్‌ మోస్ట్‌ ఫ్యాషన్‌ డిజైనర్లలో ఆమె ఒకరు. ప్రతి ఏటా ‘ది లేబుల్‌ బజార్‌’ పేరుతో అతిపెద్ద ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది. మొత్తం మీద వీరి పెళ్లి మరో చరిత్ర కానున్నది అన్నమాట. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!