తెలంగాణాలో టెన్షన్ టెన్షన్..డ్రైవర్ మృతి..పరిస్థితి ఉద్రిక్తం
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చేస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కార్మికులు బస్సులపై దాడికి పాల్పడ్డారు. ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పువ్వాడ ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రిగా ఉన్నారు. దీంతో పోలీసులు మరింత భద్రత పెంచారు. పరిస్థితి అదుపు తప్పడంతో అర్ధరాత్రి మెరుగైన చికిత్స కోసం శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించారు. కంచన్ బాగ్ లో ఉన్న డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. అంతకు ముందు కోదండరాం, అశ్వత్థామ రెడ్డి, నారాయణ, తమ్మినేని వీరభద్రం, తదితర నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను భారీగా మోహరించారు. ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల బాద్యులు అక్కడికి చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపం చెంది డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తనను తాను అర్పించుకున్నాడు. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనతో.యావత్ కార్మిక లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. చాలా మంది తమ ఉద్యోగాలు ఉంటాయో లేదోనన్న బెంగతో ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డిలు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం విలీనం చేసే దాకా ఈ పోరాటం కొన సాగుతుందని, మీ ఉద్యోగాలు ఎక్కడికీ పోవని చెప్పారు. అంతే కాకుండా అంతా ధైర్యంగా ఉండాలని, అందరూ శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా కొందరు మృతి చెందారు. మొత్తంగా చూస్తే ప్రభుత్వం మాత్రం మెట్టు దిగనంటోంది..ఆర్టీసీ కార్మికులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఏది ఏమైనా డ్రైవర్ మరణం బాధాకరం. డ్రైవర్ మృతితో తెలంగాణ అంతటా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొన్నది. నిన్నటి దాకా తమతో కలిసి ఉన్న తోటి కార్మికుడు లేక పోవడంతో ఆర్టీసీ కార్మికులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి