ఇక దాదానే సుప్రీం

ప్రపంచంలోని క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం కలిగిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ప్రెసిడెంట్ కావడం అంటే అమెరికా ప్రెసిడెంట్ కావడం కంటే ఎక్కువ. ఎందుకంటే ఇండియా అంటేనే క్రికెట్. క్రికెట్ అంటేనే ఇండియా. ఇక్కడ ఈ ఆటకున్నంత క్రేజ్ ఏ ఆటకు లేదు. ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇక్కడి క్రికెటర్లకు ఉన్నంత డిమాండ్ ఏ ఆటగాడికి లేదు. కోట్లాది రూపాయల ఆదాయంతో పాటు ఎక్కడికి వెళ్లినా రాచ మర్యాదలు, సకల సౌకర్యాలు ఉంటాయి. వీరి తర్వాతే సినీ సెలబ్రెటీలు. ఒకప్పుడు సామాన్యులైన వీరంతా ఇప్పుడు దేశాన్ని, రాజకీయాలను, ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. అయితే మిగతా దేశాలలో ఇక్కడున్నంత క్రేజ్ అక్కడ ఉండదు.

ఇదిలా ఉండగా బెంగాల్ కు చెందిన సౌరబ్ గంగూలీ అంటేనే ఇండియాలో చెప్పలేనంత క్రేజ్. ప్రస్తుతం దాదా కన్ను బిసిసిఐ పై పడింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది. కార్యదర్శిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తనయుడు జై షా వ్యవహరిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ ధుమాల్‌ బోర్డు కోశాధికారిగా ఎంపిక కానున్నారు. పోటీ లేకుండా ఏకగ్రీవంగా కీలక పదవులు దక్కించు కునేందుకు క్రికెట్‌ వర్గాలు, కేంద్ర రాజకీయ వర్గాల మధ్య గత కొంత కాలంగా సుదీర్ఘ చర్చలు కొనసాగాయి.

ఈ నెల 23న బోర్డు ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజా సహకారం నేపథ్యంలో పోటీ లేకుండా వీరందరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఢిల్లీలో అమిత్‌ షాను గంగూలీ కలవడంతోనే ఆయన బోర్డు అధ్యక్షుడు ఖాయమని వార్తలు గుప్పుమన్నాయి. అయితే 2021 బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని షా కోరగా... గంగూలీ హామీ ఇవ్వలేదని తెలిసింది. దీంతో శ్రీనివాసన్‌ వర్గానికి చెందిన బ్రిజేష్‌ పటేల్‌ పేరు అధ్యక్షుడిగా తెరపైకి వచి్చంది. అయితే చివరకు ఎక్కువ సంఘాలు బ్రిజేష్‌ ను వ్యతిరేకించడంతో గంగూలీకి మార్గం సుగమమైంది. మొత్తం మీద దాదా రాకతో బిసిసిఐ కి పూర్వ వైభవం రానుందా లేదా అన్నది తేలనుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!