నడిగర్ సంఘం..సంక్షేమమే లక్ష్యం

తమిళ సినీ రంగంలో నడిగర్ సంఘం ఓ సెన్సేషనల్. దీనిపై ఎక్కడా లేనంత క్రేజ్ ఉన్నది. దీనిలో సభ్యత్వం ఉండడం, పదవులు దక్కించు కోవడం ఇటు సినిమా రంగాన్ని, రాజకీయాలను ప్రభావితం చేస్తూ వస్తోంది. ఇందులో ఉన్న డబ్బులను మిస్యూజ్ చేస్తున్నారంటూ ప్రస్తుత సంఘం నేతలు నాజర్, విశాల్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు మిగతా నటులు. విశాల్ తమిళనాడుకు చెందిన వాడు కాదని, తెలుగు వాడైన విశాల్ కు నడిగర్ సంఘం లో పోటీ చేసేందుకు అర్హుడు కాదంటూ ధ్వజమెత్తారు. ఈ సమస్యపై ఇరు వర్గాలుగా వీడి పోయారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. మరో అడుగు ముందుకేసి కోర్టు తలుపులు తట్టారు. తమ ప్యానల్లోని సభ్యులు ఎవరూ ఒక్క పైసా తీసుకోలేదని, గతంలో ఎన్నికైన పాలకవర్గమే అవినీతి, అక్రమాలకు పాల్పడిందంటూ ధ్వజమెత్తారు నటుడు విశాల్ రెడ్డి.

ఎన్నో ఏళ్లుగా తాను ఇక్కడే ఉన్నానని, తన పోటీని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. ఇదిలా ఉండగా తాజాగా చెన్నైలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నడిగర్‌ సంఘంలో సంక్షేమ కార్యక్రమాలు సవ్యంగానే జరుగుతున్నాయని ఆ సంఘ సభ్యులు సంఘ రిజిస్ట్రార్‌ శాఖకు, రాష్ట్ర సచివాలయానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఎన్నికలు జరిగినా, ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండడం తో  లెక్కింపు ప్రక్రియ నిలిచి పోయింది. ఓట్ల లెక్కింపు ఎప్పుడు నిర్వహించాలన్నది త్వరలో వెల్లడించనున్నట్లు చెన్నై హైకోర్టు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో సంఘాల శాఖ నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్‌లకు నోటీసులు జారీ చేసింది.

విశ్రాంత నటీ, నటులకు వృద్ధాప్య భృతి వంటి సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల ఫలితాలు వెలువడక పోయినా అందిస్తోందని చెప్పారు. అలాంటిది కొందరు కావాలనే ఉసిగొల్పి, ఉద్దేశ  పూర్వకంగా అసత్య ఆరోపణలతో ఫిర్యాదులు చేశారని ఆరోపించారు నాజర్, విశాల్ లు. సంఘ అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఎన్నికలను రద్దు చేయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. ఎన్నికలు జరిగి మూడు నెలలు అయినా ఎలాంటి అవరోధాలు లేకుండా సభ్యులకు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నామని చెప్పారు. కాగా 200 మంది  తమ సంతకాలతో ఏ లేఖను పంపించడం విశేషం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!