వేణు గానం..ఆనంద గీతం
తెలుగు సినిమాలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పేరున్న వారిలో జి.ఆనంద్ ఒకరు. అమెరికా అమ్మాయి సినిమాలో ఆయన పాడిన ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక అనే పాట ఇప్పటికీ ఎప్పటికీ మరిచి పోలేం. ఎన్నో సినిమాలకు తన గాత్రంతో అరువిచ్చి ఆకట్టుకున్నారు. తాను ఓ సంగీతపు సంస్థను నెలకొల్పారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన అసలు పేరు గేదెల ఆనంద్ రావు. 2500 కు పైగా సినిమా పాటలు పాడారు. ఎందరినో గాయనీ గాయకులను పరిచయం చేశారు. దాదాపు ఏడు వేలకు పైగా ఇతర దేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. దీంతో కొన్ని సినిమాలకు పాటలు పాడే అవకాశాన్ని కోల్పోయారు. అంతే కాకుండా దాదాపు కొన్నేళ్లుగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ తదితర భాషల్లో టాప్ పొజిషన్ లో ఉన్నారు ఎస్.పి. బాలసుబ్రమణ్యం. ఆయనను దాటుకుని పాటలు రావడం అంటే అది అదృష్టమని చెప్పాలి.
నవతరం స్వర మాధురి సంస్థతో వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు అవకాశాలు కల్పిస్తున్నారు జి.ఆనంద్. పుట్టిన జిల్లాపై ప్రేమతో జిల్లాలో ఎక్కడ ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా ఆయన తప్పనిసరిగా హాజరవుతుంటారు. చాలా మంది వర్ధమాన గాయనీ గాయకులు ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చారు.150 ఆల్బమ్ లు చేశారు. కాగా మూవీ ఛాన్సెస్ లేక పోయినప్పటికీ ఆనంద్ డబ్బింగు ఆర్టిస్టు గాను, అనేక టి.వి. సీరియల్స్ కు సంగీతం అందించారు. పండంటి కాపురం సినీమాతో గాయకుడిగా ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు.
షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం, తదితర సీరియల్స్ కు మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో పాటు భక్తి పాటలతో ఆల్బమ్స్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. 1976 లో వచ్చిన అమెరికా అమ్మాయి సినిమాలో ఆనంద్ పాడిన ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక సాంగ్ ఎనలేని పేరు తీసుకు వచ్చింది. కల్పన సినిమాలో దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ అనే సాంగ్ హిట్. దాన వీర శూర కర్ణ , చక్రధారి, బంగారక్క మన ఊరి పాండవులు , ప్రాణం ఖరీదు, తాయారమ్మ బంగారయ్య సినిమాల్లో పాడారు. స్వాతంత్ర్యానికి ఊపిరి పొయ్యండి, రంగవల్లి సినిమాలకు సంగీతం అందించారు. ఇప్పటికీ సంగీతం మీదున్న మక్కువ ఆయనను ఒక చోట ఉండనీయడం లేదు. గాయనీ గాయకులకు మెళకువలు చెబుతున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి