చెలరేగిన రోహిత్..చిత్తైన బంగ్లా


టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి పోయాడు. హిట్‌మ్యాన్‌ అంతా తానై నడిపించాడు. వందో మ్యాచ్‌లో శత గ్గొట్టే అవకాశం చేజారినా, భారీ సిక్సర్లతో చుక్కలు చూపించారు. తొలి మ్యాచ్‌తో బోల్తా పడ్డ భారత్‌ ఈ గెలుపుతో సమంగా నిలిచింది. రాజ్ కోట్ లో రెండో టీ-20 మ్యాచ్ బాంగ్లాదేశ్ జట్టుతో ఇండియా తలపడింది. రోహిత్‌ శర్మ మెరుపు బ్యాటింగ్‌ సౌరాష్ట్ర క్రికెట్‌ స్టేడియాన్ని ముంచెత్తింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. మొహమ్మద్‌ నయీమ్‌ 36 పరుగులు చేయగా, సౌమ్య సర్కార్‌ 30 పరుగులతో రాణించారు. భారత స్పిన్నర్‌ చహల్‌ 2 వికెట్లు తీశాడు.

అనంతరం బరిలోకి దిగిన భారత్‌ 15.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 43 బంతుల్లో 85 పరుగులు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు రోహిత్. శిఖర్‌ ధావన్‌ 27 బంతుల్లో 30 పరుగులతో రాణించాడు. సిరీస్‌ చేజార్చు కోకుండా ఉండాలంటే ఛేదించాల్సిన లక్ష్యాన్ని రోహిత్‌ సులువుగా మార్చేశాడు. 6 ఫోర్లు 6 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముస్తాఫిజుర్‌ ఓవర్లో 2 ఫోర్లు, బౌలర్‌ తలపై నుంచి ఓ భారీ సిక్సర్‌ బాదేశాడు. ఆ తర్వాత ఇస్లామ్‌ను ఓ బౌండరీ, సిక్సర్‌తో శిక్షించాడు.

5.2 ఓవర్లలోనే జట్టు స్కోరు 50కి చేరింది. మొసద్దిక్‌ హుస్సేన్‌ వేసిన పదో ఓవర్‌లో రోహిత్‌ మరింతగా చేలరేగి పోయాడు. తొలి మూడు బంతులు సిక్సర్లే. ఆ ఓవర్‌ పూర్తి కాక ముందే 9.2 ఓవర్లకే భారత్‌ 100 పరుగులు పూర్తయ్యాయి. రోహిత్‌ ధాటికి రెండో ఫిఫ్టీకి కేవలం 4 ఓవర్లే అవసరమయ్యాయి. కాగా 100  అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్‌ గుర్తింపు పొందాడు. అతడి కంటే ముందు షోయబ్‌ మాలిక్‌ 111 మ్యాచులతో ముందున్నాడు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!