స్టార్స్ మధ్య వార్
ఈ సారి సంక్రాంతి పండుగకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. అదెక్కడంటే సినిమాల విడుదలకు సంబంధించి. బాక్సాఫీస్ వేదికగా జరిగే వార్ ప్రతీ ఏడాది ఉండేదే. సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి భారీ సినిమాలన్నీ పోటీ పడుతుంటాయి. పండగ సమయంలో రెండు, మూడు భారీ సినిమాలు విడుదలైనా కలెక్షన్లు బాగానే ఉంటాయని నిర్మాతలు భావిస్తుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో, సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఒకే రోజున రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాయి.
దీంతో రెండు సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంది. కలెక్షన్లపై తీవ్ర ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓపెనింగ్స్, కలెక్షన్స్ దెబ్బ తింటాయని బయ్యర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాల విడుదల తేదీలు మార బోతున్నట్టు తెలుస్తోంది. అల వైకుంఠపురములో చిత్రం 11 న, సరిలేరు నీకెవ్వరు సినిమా 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయట. రెండు భారీ సినిమాల మధ్య రెండ్రోజుల గ్యాప్ రావడం ఇద్దరికీ మేలు చేస్తుందని భావిస్తున్నారు.
మారిన విడుదల తేదీల గురించి ఆయా చిత్ర నిర్మాతలు త్వరలో అధికారిక ప్రకటనలు విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాగా రెండు భారీ చిత్రాలు ఒకే రోజు తలపడకుండా రెండు రోజుల గ్యాప్‌తో రానుండటంతో, ఇరు సినిమాలు భారీ వసూళ్లను కొల్లగొడతాయని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయగా, మరో సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి