క‌నిపిస్తే కాల్చివేత..ఇండియా ష‌ట్ డౌన్

ప్ర‌పంచం ఒకే ఒక్క వైర‌స్ ను చూసి వ‌ణుకుతోంది. 195 దేశాల‌కు విస్త‌రించిన ఈ మ‌హ‌మ్మారి కోట్లాది ప్ర‌జ‌ల‌ను, దేశాధినేత‌ల‌ను, పాల‌కుల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతోంది. అంతే కాదు ఏ స‌మ‌యంలో ఎవ‌రిని కాటేస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ వైర‌స్ దెబ్బ‌కు జ‌నం పిట్ట‌ల్లా రాలుతున్నారు. టెక్నాల‌జీ ప‌రంగా ఎంతో ముందంజ‌లో ఉన్నా ప్ర‌పంచాన్ని శాసించే పెద్ద‌న్న అమెరికా సైతం క‌రోనాను చూసి జ‌డుసుకుంటోంది. దీని ప్ర‌భావం ఏ మేర‌కు ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే ఇట‌లీని క‌మ్మేసిన ఈ భూతం దెబ్బ‌కు ప్ర‌ధాన దేశాల‌న్నీ విల‌విల‌లాడుతున్నాయి. ఇక ఇండియా విష‌యానికి వ‌స్తే క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అంటూ ఇక్క‌డ కూడా పాకింది. ఇప్ప‌టి దాకా క‌నీసం 500 మందికి పైగా ఈ వ్యాధిన బారిన ప‌డ్డారు. కోట్లాది రూపాయ‌లు కేంద్ర‌, రాష్ట్రాలు నీళ్ల‌ల్లా ఖ‌ర్చు చేస్తున్నాయి. సాక్షాత్తు భార‌త‌దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర‌దాస్ మోదీజీ, ఏపీ, తెలంగాణ సీఎంలు జ‌గ‌న్, కేసీఆర్ లు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు.
లాక్ డౌన్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు మోదీ ప్ర‌క‌టించ‌గా కేసీఆర్ ఏకంగా క‌నిపిస్తే కాల్చివేత‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు వ‌ర‌కు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఈ వైర‌స్ ను క‌ట్ట‌డి చేయ‌డంలో అగ్ర రాజ్యాలు ర‌ష్యా, చైనాలు కొంత మేర‌కు క‌ట్ట‌డి చేయ‌గ‌లిగాయి. కానీ మిగ‌తా దేశాలు దీనిని లైట్ గా తీసుకున్నాయి. దీంతో వ్యాధి ముదిరి జ‌నాన్ని బెంబేలెత్తిస్తోంది. తెలంగాణ‌లో ప‌రిస్థితి చేయి దాట‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. పూర్తి స్థాయిలో క‌ర్ఫ్యూ ను విధిస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. గుంపు గా వ‌స్తే కాల్చివేయండంటూ ఆయ‌న పోలీసుల‌ను ఆదేశించారు. కేవ‌లం క‌రోనా కార‌ణంగా దేశ , రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కునారిల్లిపోయాయి. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న అంత‌టా నెల‌కొంది. నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు కొండెక్కాయి. మ‌రికొన్ని రోజులు ఇలాగే ఉండాల్సి ఉంటుంద‌ని మోదీ, కేసీఆర్‌లు స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ‌తో స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఈ మేర‌కు దండం పెట్టి వేడుకుంటున్నామ‌ని, ద‌య‌తో అర్థం చేసుకుని స‌హ‌క‌రించాల‌ని విన్న‌వించారు.
నిన్న‌టి దాకా దేశాల‌ను త‌న కంట్రోల్‌లో ఉంచేందుకు ప్ర‌య‌త్నం చేసిన అమెరికా ఇప్పుడు దిక్కు తోచ‌ని స్థితికి దిగ‌జారింది. ఒక్క న్యూయార్క్ న‌గ‌రంలోనే అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోదు కావ‌డంతో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగింది అక్క‌డి ప్ర‌భుత్వం. ఇదిలా ఉండ‌గా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏకంగా చైనాను టార్గెట్ చేశారు. ఈ వైర‌స్ ను వ్యాప్తి చెందేలా చేసింది చైనానేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ తీయాల‌న్న ల‌క్ష్యంతోనే చైనా ఈ దురాగ‌తానికి పాల్ప‌డిందంటూ నిప్పులు చెరిగారు. అయినా డ్రాగ‌న్ చైనా డోంట్ కేర్ అని స్ప‌ష్టం చేసింది. తాము ఈ వ్యాధిని ముందుగానే ప‌సిగ‌ట్టి కంట్రోల్ చేయ‌గ‌లిగామ‌ని, మిగా దేశాలు త‌గు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, అది వారి మీదే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అన్నిటికంటే ఎక్కువ‌గా క‌రోనా వైర‌స్ ను చాలా తెలివిగా, ముందుజాగ్ర‌త్త‌గా నియంత్రించిన ఘ‌న‌త మాత్రం క‌మ్యూనిస్టు ర‌ష్యాకే ఉంటుంది. ఎందుకంటే అక్క‌డ పుతిన్
ఇళ్ల‌ల్లో ఉంటారా లేక 5 ఏళ్ల పాటు జైలులో గ‌డుపుతారా అంటూ ఆ దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. దీంతో జ‌డుసుకున్న జ‌నం ఒక్క‌రు కూడా బ‌య‌ట‌కు రాలేదు. దీంతో ఆ వైర‌స్ అక్క‌డి నుంచి ఇత‌ర దేశాల‌కు పాకింది. ఇపుడు లోకాన్ని నిట్ట నిలువునా భ‌య‌ప‌డేలా చేస్తోంది. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా విన్న‌వించినా ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా స్వీయ నియంత్ర‌ణ పాటిస్తేనే ఈ వ్యాధి నుంచి కాపాడుకోగ‌లం. లేక పోతే చావే శ‌ర‌ణ్యం. 

కామెంట్‌లు