కంపెనీలు భళా..అమ్మకాలు డీలా

ఒక్కో కంపెనీకి ఘనమైన చరిత్ర ఉంది. కానీ వాహనాల అమ్మకాల్లో మాత్రం ఆశించినంతగా వాహనం ప్రియులు, కొనుగోలుదారులను ఆకట్టుకోలేక పోయాయి. దేశీయంగా చూస్తే ఆర్ధిక రంగం పూర్తిగా గాడి తప్పింది. దీనిని ఓ క్రమ పద్ధతిలోకి తీసుకు వచ్చేందుకు దేశ ఆర్థిక శాఖా మంత్రి సీతారామన్ నానా తంటాలు పదుహానది. అయినా ఈ రంగం దిగి రానంటోంది. జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదిలా ఉండగా అన్ని రంగాలు దిగాలు పడ్డాయి. దిక్కు తోచని స్థితిలోకి వెళ్లి పోయాయి. ఇదిలా ఉండగా వాహనాల రంగం కూడా పూర్తిగా కుదేలైంది. ఎన్ని ఆఫర్లు, గిఫ్టులు ప్రకటించినా అమ్ముడు పోలేదు. ఎన్ని డిజైన్లు రూపొందించినా అమ్మకాలు మాత్రం పెరగలేదు. దేశీయ మార్కెట్లో మరోసారి వాహనాల విక్రయాలు మందగించాయి. ఇప్పటికే వరుస త్రైమాసికాల్లో భారీగా పడిపోతున్న వాహన విక్రయాలు గత మాసంలో క్షీణతను నమోదు చేసాయి.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం. దేశీయ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 1.24 శాతంక్షీణించి 2,35,786 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 2,38,753 యూనిట్లుగా వుంది. దేశీయ కార్ల అమ్మకాలు 8.4 శాతం తగ్గి 1,42,126 యూనిట్లకు చేరుకున్నాయి. 2018 డిసెంబర్‌లో 1,55,159 యూనిట్లు. గత నెలలో మోటార్‌ సైకిల్ అమ్మకాలు 12.01 శాతం క్షీణించి 6,97,819 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది 7,93,042 యూనిట్లు. డిసెంబరులో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16.6 శాతం క్షీణించి 10,50,038 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది 12,59,007 యూనిట్లు. వాణిజ్య వాహనాల అమ్మకాలు 12.32 శాతం తగ్గి డిసెంబర్‌లో 66,622 యూనిట్లకు చేరుకున్నాయని సియామ్ తెలిపింది.

2018 డిసెంబర్‌లో 16,17,398 యూనిట్ల నుంచి వాహనాల అమ్మకాలు 13.08 శాతం క్షీణించి 14,05,776 యూనిట్లకు చేరుకున్నాయి. 2018 లో 33,94,790 యూనిట్లతో పోలిస్తే 2019 లో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 12.75 శాతం తగ్గి 29,62,052 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం వాహనాల అమ్మకాలు 2019 జనవరి, డిసెంబర్‌లో 13.77 శాతం తగ్గి 2,30,73,438 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది  2018 లో 2,67,58,787 యూనిట్లుగా ఉన్నాయి. కాగా టాటా మోటార్స్‌  చైనా మార్కెట్‌లో మాత్రం వరసగా ఆరు నెలలో కూడా డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ను సాధించింది. దీంతో మార్కెట్లో  టాటా మోటార్స్‌ షేరు నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లింది. మారుతి సుజుకి  కూడా లాభపడుతోంది.

కామెంట్‌లు