సుభాష్ నిర్ణయం..జీ షేర్ల పతనం

భారతీయ వినోద రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న మీడియా మొఘల్ సుభాష్ చంద్ర ఉన్నట్టుండి జీ గ్రూప్ కంపెనీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో కంపెనీపై తీవ్ర ప్రభావం చూపించింది. కంపెనీ షేరు భారీ నష్టాలతో కొనసాగింది. ఇన్వెస్టర్లు ట్రేడర్ల అమ్మకాలతో జీ 9 శాతం నష్టపోయింది. గత సెషన్‌లో 343.80 వద్ద ముగిసిన ఈ షేరు, 312.40 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. జీలో సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ వాటా అమ్మకం గురించి గత వారం ప్రతికూల ప్రభావం చూపక పోయినప్పటికీ, జీ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి సుభాష్ చంద్ర పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం ప్రతికూలంగా మారింది. కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్‌పర్సన్‌కు బంధుత్వం వంటివి ఉండ కూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్‌ రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది.

అయితే సుభాష్ చంద్ర కుమారుడు పునిత్ గోయెంకా నాన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్‌ వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు గా ఆర్‌ గోపాలన్‌, సురేంద్ర సింగ్, అపరాజిత జైన్‌ నియమితులైనట్లు పేర్కొంది. కొత్త బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లు ఆరుగురు, ఎస్సెల్ గ్రూప్ తరఫున ఇద్దరు ఉంటారు. రుణాల భారాన్ని తగ్గించుకునే దిశగా ప్రమోటర్ల వాటాలను మరింతగా విక్రయించేందుకు ఎస్సెల్ గ్రూప్ మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో చంద్ర రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 30న కంపెనీలో 35.79 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా సెప్టెంబర్ 30 నాటికి 22.37 శాతానికి తగ్గింది. రుణాల చెల్లింపుల కోసం జీఈఈఎల్‌లో 16.5 శాతం వాటాలు విక్రయించనున్నట్లు ఎస్సెల్ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వినోదం రంగంలో టాప్ రేంజ్ లో కొనసాగుతూ వచ్చింది. అయితే ఎంటర్ టైన్ మెంట్ రంగం నుంచి ఇతర రంగాలకు విస్తరించడం తో అసలుకే మోసం వచ్చింది. టీవీ 18 ను రిలయన్స్ గ్రూప్ కంపెనీ టేకోవర్ చేసుకున్నాక దాని స్వరూపమే మారి పోయింది. వరల్డ్ వైడ్ గా పాపులర్ కంపెనీగా పేరున్న సోని కొంత వాటా కొనుగోలుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ఆఫర్ కూడా ప్రకటించింది. ఇదే సమయంలో జీ గ్రూప్ కూడా అదే బాటలో పడితే కొంత మేర నష్టాల నుండి గట్టెక్కే వీలుండేది. మొత్తం మీద సుభాష్ చంద్ర తీసుకున్న డిసిషన్ మొదటికే మోసం వచ్చింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!