తెల్లొళ్ల కోటలో పాగా వేసిన నల్ల సూరీలు
రాజ్యాలు కూలి పోయినా ..టెక్నాలజీ మారినా..మనుషులు అంతరిక్షంలోకి వెళ్లినా ఇంకా కుల వ్యవస్థతో పాటు జాతుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్నది. ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అమెరికాలో ఆఫ్రికన్స్ అన్నా..నల్ల జాతీయులంటే చులకన భావన. ఇప్పటికింకా తెల్లవాళ్ల డామినేషన్ కంటిన్యూ అవుతోంది. నలుగురు బ్లాక్ మెన్స్ స్టార్టప్ తో ఊహించని రీతిలో సక్సెస్ అయ్యారు. జాన్ హెన్రీ, హెన్రీ పియరీ జాక్వెస్, బ్రాండన్ బ్రియాంట్ , జారిడ్ టింగల్ కో ఫౌండర్స్ గా హర్లెమ్ కేపిటల్ ను స్థాపించారు. ఫైనాన్సియల్ పరంగా ఈ స్టార్టప్ ప్రాఫిట్‌ను సాధించింది స్వల్ప కాలంలోనే. బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ విభాగంలో వీరు నలుగురు సూపర్ స్టార్స్‌గా పేరు గడించారు. అమెరికాలో అక్కడి వారిదే హవా. వారిని తట్టుకుని నిలబడటం చాలా కష్టం.
ఐటీ, ఫార్మా, టెలికాం, తదితర రంగాలైతే ఓకే. కానీ బిజినెస్ రంగంలో వీరే ఎక్కువగా ఉంటారు. వీరి ఆధిపత్యాన్ని తట్టుకుని ఫైనాన్షియల్ సెక్టార్‌లో టాప్ రేంజ్‌లోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నలుగురు బ్లాక్ మెన్స్‌తో పాటు ఓ వైట్ మెన్ అంటే ఓ అమెరికన్ కూడా తోడయ్యారు. అతడే జాన్ హెన్రీ. హర్లెమ్ కేపిటల్ పార్ట్‌నర్స్ ( హెచ్‌సీపీ) కంపెనీలో ఇతను కూడా భాగస్వామిగా ఉన్నారు. వీరు పెట్టిన సంస్థలో పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్‌ను తేలికగా సాల్వ్ చేస్తూ దూసుకెళుతోంది హెచ్‌సీపీ. కన్సూమర్ టెక్నాలజీ అసోసియేషన్ డిక్లేర్ చేసిన రెండు ఆర్థిక రంగ సంస్థల్లో హెచ్‌సీపీ ఒకటి. అంటే బిజినెస్ పరంగా ఏ రేంజ్‌కు చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. 10 మిలియన్లు పెట్టుబడిగా ఉమెన్ ఓన్ చేసుకున్న కంపెనీల్లో పెట్టాయి.
2019లో ప్రపంచ వ్యాప్తంగా 30 ఏళ్ల వయసు లోపు కలిగిన 30 సోషల్ ఆంట్రప్రెన్యూనర్లను ఎంపిక చేసింది. ఆ లిస్టులో టాప్ వన్‌లో చేరింది హర్లెమ్ కేపిటల్ పార్ట్‌నర్స్. ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించారో, స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో ..ఆంట్రప్రెన్యూర్స్, స్టార్టపర్స్, బిజినెస్ టైకూన్స్, సంస్థలు, కంపెనీలకు హెచ్‌సీపీ వెన్ను దన్నుగా నిలుస్తుంది. రాబోయే రెండు దశాబ్దాల కాలంలో 1000 డిఫరెంట్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలన్నది ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. చాలా కంపెనీల్లో జాతుల మధ్య వైరం కొనసాగుతోంది. వైట్ మెన్స్ స్థాపించిన కంపెనీల్లోనే వీరు ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ బ్లాక్ మెన్స్ ఏర్పాటు చేసిన కంపెనీల వైపు వీరు కన్నెత్తి చూడడం లేదు. దీనిని గమనించిన హెచ్‌సీపీ వారికి సపోర్ట్ గా నిలువాలని నిర్ణయించింది. ఆ నలుగురితో పాటు వైట్ మెన్ కూడా తోడై..వ్యాపార నిర్వహణకు సంబంధించి రీసెర్చ్ చేశాడు.
భారీ ఎత్తున డాక్యూమెంట్ కూడా తయారు చేశాడు. వెంచర్ కేపిటల్స్, స్మాల్ బిజినెస్ లకు ఆసరా దొరుకుతోంది. 2.2 శాతం వెంచర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్స్ అంతా ఉమెన్స్ స్థాపించిన కంపెనీలకు వెళుతోంది. ఇందులో కూడా వివక్ష ..వైట్ ఉమెన్స్‌కే ఎక్కువ ప్రయారిటీ. కేకేఆర్ అండ్ కంపెనీ ఏకంగా హెచ్‌సీపీలో 200 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఇది ఓ రికార్డు. మా కలర్ వేరు కావచ్చు..కానీ మేమంతా ఒక్కటే..సమాజంలో మార్పు తీసుకు రావాలన్నదే మా ఆశయం. అందుకే ఈ స్టార్టప్ కంపెనీ. ఆ దిశగానే పనిచేస్తుందని అంటున్నారు బ్లాక్ అండ్ వైట్ మెన్స్. తెల్లోళ్ల రాజ్యంలో నల్ల సూరీలు జయకేతనం ఎగుర వేశారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగంలో.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి