ఫ్రాంచైజీలపై రాహుల్ ఫైర్

మాజీ భారత జట్టు సారధి, ప్రస్తుత క్రికెట్ అకాడెమీ బాధ్యుడు రాహుల్ ద్రవిడ్ ఫ్రాంచైజీలపై నిప్పులు చెరిగారు. సామాన్యంగా తనపని తాను చేసుకుని పోయే స్వభావం ఉన్న వ్యక్తి. ఉన్నట్టుండి తన మనసులోని అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇండియాలో ప్రస్తుతం ఐపీఎల్ హవా కొనసాగుతోంది. కోట్లాది రూపాయల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కార్పొరేట్ కంపనీలు దీనిపై కన్నేశాయి. అంతే కాకుండా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు మంచి ఛాన్సెస్ వస్తున్నాయి. అయితే ఫ్రాంచైజీలు మాత్రం భారత సీనియర్ ఆటగాళ్లను అస్సలు పరిగణలోకి తీసు కోవడం లేదు. దీనిపై ది వాల్ తీవ్రంగా స్పందించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భారత క్రికెట్ కోచ్ లను తీసుకోకుండా ఫ్రాంచైజీలు తప్పు చేస్తున్నాయని మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయ పడ్డాడు. లీగ్‌లో ఎక్కువ మంది మన ఆటగాళ్లే ఉంటారని, వారిని అర్థం చేసు కోవడంలో ఇండియన్ కోచ్ లే ముందుంటారని స్పష్టం చేశారు. ఎంతో మంది ప్రతిభా వంతులైన కోచ్‌లు మనకు అందుబాటులో ఉన్నారని, హెడ్‌ కోచ్‌గా పెట్టుకునే అవకాశం∙లేకపోతే కనీసం, అసిస్టెంట్‌ కోచ్‌గానైనా ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ఈ దిగ్గజ ద్రవిడ్‌ సూచించాడు.

మన​కు చాలా మంచి కోచ్‌లు ఉన్నాయి. మన వాళ్ల యొక్క శక్తి సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. మన క్రికెట్‌ డిపార్ట్‌మెంట్‌లో చాలా టాలెంట్‌ ఉంది. ప్రత్యేకంగా మెరుగైన కోచ్‌లు భారత్‌ సొంతం. వారికి మనం అవకాశాలు ఇవ్వాలి అని ద్రవిడ్‌ అభిప్రాయ పడ్డాడు. కనీసం ఐపీఎల్‌లో మన వాళ్లను అసిస్టెంట్‌ కోచ్‌లుగా కూడా తీసుకోక పోవడం తనను నిరాశకు గురి చేస్తుందన్నాడు. కొన్ని ఫ్రాంచైజీలు భారత్‌ కోచ్‌లను ఎంపిక చేసుకుని లాభం పొందుతున్నాయి. ఆయా ఫ్రాంచైజీలకు భారత్‌ ప్లేయర్స్‌ గురించి తెలుసన్నాడు. లీగ్‌లో ఎక్కువ మంది మన ఆటగాళ్లే ఉంటారని, వారిని అర్థం చేసు కోవడంలో భారత కోచ్‌లే ముందుంటారని ద్రవిడ్ చెప్పాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!