ఉద్దవ్ ప్రమాణంలో అంబానీ ఫ్యామిలీ
భారతీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ ఫ్యామిలీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ఇండియన్ కుబేరుడు ఎక్కడ వుంటే అక్కడ లక్షలాది కళ్ళు వెంటాడుతాయి. ఎక్కువగా దృష్టి పెడతాయి. రిలియన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చైర్మన్ గా ఉన్న ముకేశ్ అంబానీ ఆస్తులు ట్రిలియన్ డాలర్లను ఎప్పుడో దాటేశాయి. ఇప్పటికే టెలికాం, ఆభరణాలు, దుస్తులు, ఆయిల్, ఇలా ప్రతి రంగంపై తన పట్టు సాధించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం టెలికాం రంగాన్ని షేక్ చేస్తోంది రిలయన్స్ జియో. ముకేశ్ అంబానీ ఎక్కడ కాలు మోపితే అక్కడ ఆర్ధిక వ్యవహారాలే ప్రాధాన్యత వహిస్తాయి. ఇది సహజం కూడా. ఈ బిజినెస్ కింగ్ మేకర్ ఏది మాట్లాడిన, ఏది చేసినా, ఎక్కడికి వెళ్లినా అది నిమిషాల్లోపే వైరల్ అవుతుంది.
ఎందుకంటే ప్రతిదీ కోట్లతో ముడిపడి ఉంటుంది కనుక. తాజాగా ముకేశ్ అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. మరాఠా సీఎంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఎట్టకేలకు కొలువు తీరినట్టయింది. ముంబై శివాజీ పార్క్‌లో అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన అతిరధ మహారధులు హాజరయ్యారు. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంబానీతో పాటు ఆయన భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఉద్ధవ్‌కు అభినందనలు తెలిపారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో పాటు సుప్రియా సూలే, రాజ్‌ఠాక్రే, సుశిల్ కుమార్ షిండే, ఎంకే స్టాలిన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. నెల రోజుల తరువాత అనేక అనూహ్య పరిణామాల మధ్య చివరికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో మహా వికాస్ అఘాడి కూటమి ఆధ్వర్యంలో సర్కార్ కొలువు దీరింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి