దిగ్గజ కంపెనీలకు రియల్ మి షాక్


స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో చైనాకు చెందిన కంపెనీలే తమ హవాను కొనసాగిస్తున్నాయి. వరల్డ్ మార్కెట్ లో ఇప్పటికే షావో మి ఏకంగా ఐదో ప్లేస్ కు చేరుకుంది. దిగ్గజ యాపిల్, శాంసంగ్ కంపెనీలను దాటుకుని ఇండియన్ మార్కెట్ ను రెడ్ మి శాసిస్తోంది. ఇప్పటికే 10 లక్షల మొబైల్స్ అమ్మి రికార్డు బ్రేక్ చేసింది. లెనోవా, మోటరోలా, వివో , షావోమి , రియల్ మి మొబైల్స్ కంపెనీలన్నీ ఇప్పుడు చైనాకు చెందినవే. తాజాగా శాంసంగ్ మడత ఫోన్ ను లంచ్ చేసింది చైనాలో. దీని ధర లక్షా 75 వీలుగా ఉండబోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మోటరోలా కంపెనీ సైతం 5 జీ స్మార్ట్ ఫోన్ ను ప్రదర్శనలో ఉంచింది. మరో వైపు మొబైల్ ప్రియులను ఆకట్టుకునేందుకు రియల్ మి అద్భుతమైన ఫీచర్స్ తో కొత్తగా పలు మోడల్స్ తో రిలీజ్ చేసింది. తాజాగా
రియల్‌ మి..ఎక్స్‌2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 855 ప్లస్‌ చిప్‌ అమర్చిన ఈ మోడల్‌ రెండు వేరియంట్లలో లభిస్తుండగా 8జీబీ,128జీబీ ధర 29,999 వద్ద నిర్ణయించింది.12జీబీ, 256జీబీ వేరియంట్‌ ధర 33,999. వీటిలో 64 మెగా పిక్సెల్‌ క్వాడ్‌ కెమెరాను అమర్చింది. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ కేవలం 35 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్‌ అవుతుందని వివరించింది.

దీంతో పాటు రియల్‌ ఎక్స్‌ 2  ప్రొ మాస్టర్‌ ఎడిషన్‌ను కూడా లాంచ్‌ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి ఆన్‌లైన్‌ స్టోర్ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి. రియల్ మీ ఎక్స్2 ప్రో మాస్టర్ ఎడిషన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ గల ఒక్క వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. ఇది క్రిస్మస్‌ నాటికి అందుబాటులోకి వస్తుంది. రియల్‌మి ఎస్‌ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా కంపెనీ లాంచ్‌ చేసింది. 48 ఎంపీ ప్రైమరీ క్వాడ్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో  రెండు వేరియంట్లలో లాంచ్‌ చేసింది. 9999, 10,999 ధరలతో అమ్మకానికి పెట్టింది. 

కామెంట్‌లు