అంతిమ తీర్పు కోసం ఎదురు చూపు

దిశ దారుణ హత్య కేసు దేశాన్ని, ప్రపంచాన్ని ఇండియా వైపు చూసేలా చేసింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం అంతిమ తీర్పు ఏం చెప్పా బోతోందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు పోలీసులు, తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా తమకూ ప్రతిష్టాత్మక మైనదేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై ఏమౌతుందోనని యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోందని పేర్కొంది. ఎన్‌కౌంటర్‌పై అనేక సందేహాలు ఉన్నందునే రీ పోస్టుమార్టం నిర్వహించాలని ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయని, దీనిపై ప్రభుత్వం కూడా ముందుకొచ్చి పారదర్శకతను చాటు కోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది.

ఎన్‌కౌంటర్‌లో మరణించిన మహమ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మృతదేహాల వ్యవహారంపై హైకోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పై కోర్టు ఆదేశాలను  అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పింది. మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ వ్యవహారాన్ని హైకోర్టులో తేల్చు కోవాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందనే పిల్‌ పై ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. వేరే రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులతో రీ పోస్టుమార్టం చేయించాలని న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి కోరారు. ఏజీ కల్పించుకుని తెలంగాణాలో ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులున్నారని, వేరే రాష్ట్రాల వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. మృతదేహాలు పాడైపోతున్నాయని గాంధీ ఆస్పత్రి వైద్యులు కూడా చెబుతున్నారని తెలిపింది.

ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు ఉన్నాయని, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే రీ పోస్టుమార్టం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పోలీసుల ప్రతిష్ట, రాష్ట్ర ప్రతిష్టలే కాకుండా తెలంగాణ హైకోర్టు ప్రతిష్ట కూడా ఇందులో ముడిపడి ఉందని పేర్కొంది. దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ విశ్వ వ్యాప్తమైందని, ఏం జరగబోతోందోనని దేశమే కాకుండా యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బూటకపు ఎన్‌కౌంటర్‌ అనే విమర్శలు వచ్చినప్పుడు నిజాలు నిగ్గు తేల్చాలని ప్రభుత్వమే ముందుకు రావాలని, అయితే ఎందుకు అడ్డుపడుతోందో అర్థం కావడం లేదని సందేహాన్ని వ్యక్తం చేసింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!