దివాలాకు లైన్ క్లియర్
భారతీయ విమానయాన రంగం తీవ్ర ఒడిడుకులు లోనవుతోంది. జెట్ ఎయిర్ వేస్ దివాలా పరిష్కార గడువును 90 రోజుల పాటు పొడిగించేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అనుమతించింది. దక్షిణాఫ్రికాకు చెందిన సినర్జీ గ్రూపు మరింత సమయం కోరుతుండడం, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఆసక్తి వ్యక్తీకరిస్తున్న నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ రుణ దాతల కమిటీ దివాలా పరిష్కార గడువును పొడిగించాలంటూ ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ను కోరింది. జెట్ ఎయిర్‌వేస్‌కు కార్పొరేట్ దివాలా పరిష్కార గడువు ముగిసింది. అయితే ఈ గడువును పొడిగిస్తూ ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసింది. జెట్ ఎయిర్‌వేస్‌కు సినర్జీ గ్రూపు ఒక్కటే బిడ్ దాఖలు చేయగా, వాటాదారుల ప్రయోజనం దృష్ట్యా పెట్టుబడులపై సరైన నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కోరుతుండడం గమనార్హం.
ముంబై కేంద్రంగా జెట్ ఎయిర్ వేస్ పనిచేస్తోంది. ఇండియాలో ఇండిగో ఎయిర్ లైన్స్ తర్వాత రెండో అతిపెద్ద విమానయాన సంస్థగా జెట్ గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా 74 స్థావరాల నుంచి మొత్తం 300 విమానాలను ఈ సంస్థ నడిపిస్తోంది. ద్వితీయ శ్రేణి స్థావరాలు ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరులో ఉన్నాయి. జెట్ ఎయిర్ వేస్ 1992 ఏప్రిల్ 1న ఎయిర్ టాక్సీ కార్యకలాపాలను ప్రారంభించింది. మలేషియా ఎయిర్ లైన్స్ నుంచి నాలుగు బోయింగ్ 737-300 అద్దె విమానాలు తీసుకుని జెట్ ఏయిర్ వేస్ తన వాణిజ్య కార్యకలాపాలను 1993 మే 5 నాడు ప్రారంభించింది. అప్పటికే భారత్ లోని విదేశీ విమాన సంస్థలకు అమ్మకాలు, మార్కెటింగ్ సేవలను అందిస్తోన్న జెట్ ఎయిర్ లిమిటెడ్ సంస్థకు యజమానిగా ఉన్న నరేష్ గోయల్ జెట్ ఏయిర్ వేస్ ను స్థాపించారు.
దేశీయ మార్కెట్ ను 1953 మధ్య కాలంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఏకఛత్రాధిపత్యం వహిస్తోన్న రోజులవి. జెట్ తన అంతర్జాతీయ కార్యకలాపాలను మార్చి 2004లో చెన్నై నుంచి కొలంబోకు ప్రారంభించింది. నరేష్ గోయల్ చేతిలో జెట్ ఎయిర్ వేస్ వాటా 80 శాతం ఉన్నప్పటికీ ఇది బాంబే స్టాక్ ఎక్సెంజీలో ఇది నమోదైంది. ఈ సంస్థలో 2011 మార్చి 31 నాటికి 13,177 ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2006 జనవరిలో జెట్ ఏయిర్ వేస్ US$500 మిలియన్లకు ఎయిర్ సహారాను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. విమానాయాన రంగంలో ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఇదే ప్రథమం. దేశీయ రంగంలో పేరెన్నికగల వాటిలో జెట్ఎయిర్ వేస్ ముంబయి నుంచి న్యూఢిల్లీకి వారానికి 95 విమానాలు, న్యూఢిల్లీ నుంచి ముంబయికి 81, బెంగళూరు నుంచి ముంబయికి 56 , ముంబయి నుంచి చెన్నైకి 48 నిమానాలను నడిపిస్తోంది.
ప్రత్యేక సందర్భాల్లో బెంగళూరు నుంచి రాజ్ కోట్, రాయ్ పూర్ నుంచి భోపాల్ , జైపూర్ నుంచి న్యూఢిల్లీకి కూడా విమానాలు నడుపుతోంది. అంతర్జాతీయ రంగంలో కూడా జెట్ ఎయిర్ వేస్ ముంబయి నుంచి దుబాయ్, ముంబయి నుంచి అబూదాబీ, హైదారాబాద్ నుంచి అబుదాబీ, న్యూఢిల్లీ నుంచి ఖాడ్మంటు, చెన్నై నుంచి అబుదాబీ, చెన్నై నుంచి అబుదాబీ మార్గాల్లో విమానాలు నడుపుతోంది. జెట్ ఎయిర్ వేస్ దేశీయంగా 47 గమ్య స్థానాలకు, అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల్లోని 19 దేశాల్లో గల 22 స్థానాలకు విమానాలు నడిపిస్తోంది. తక్కువ దూరం గల విదేశీ గమ్య స్థానాలకు రాబోయే తరానికి చెందిన బోయింగ్ 737 విమానాలను ఈ సంస్థ ఎక్కువగా ఉపయోగిస్తోంది.
72-500 విమానాలను ఎక్కువగా దేశీయ మర్గాల్లో ఉపయోగిస్తున్నారు. ఎక్కువ దూరం ట్రావెల్ చేసేందుకు ఎయిర్ బస్ 330-200 మరియు బోయింగ్ 777-300 విమానాలు ఉపయోగిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం బిజినెస్, ఎకానమీ తరగతుల్లో బుకింగ్ సౌకర్యం కల్పించిన తొలి విమాన సంస్థ జెట్ ఎయిర్ వేసే కావచ్చు. ఇలాంటి సౌకర్యం కేవలం దేశీయ విమానాలకు మాత్రమే ఉండేది. ప్రయాణీకుల కోసం నాణ్యమైన విమానాశ్రయ లాంజ్ లు, కోచ్, బస్సు సౌకర్యం, వెబ్ చెకిన్ వంటి ఆన్ గ్రౌండ్ సేవలను అందిస్తోంది. రుచి, నాణ్యమైన భోజనంతో పాటు సుస్వర సంగీతం, సుప్రసిద్ధ సినిమాల వంటి వినోద సౌకర్యాలు కల్పిస్తోంది. సౌకర్యవంతమైన సీట్లవల్ల ఎలాంటి అలసట లేకుండానే తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని గమ్యస్థానం చేరుకునే సౌకర్యం ఉంది.
విమానంలో సహాయక సిబ్బంది కావాల్సిన సదుపాయాలు, సహాయం అందించడం పాటు ప్రయాణికులతో పాటు వారివెంట తీసుకెళ్లే జంతువులకు కూడా మందులు అందుబాటులో ఉంచుతోంది. తరుచూ జెట్ ఎయిర్ లైన్స్ విమానాల్లో ప్రయాణించే వారికి జెట్ ప్రివిలేజ్ లో భాగస్వామ్యం కల్పిస్తారు. ఇలాంటి వారికి మరిన్ని బోనస్ లు, సదుపాయాలు కల్పిస్తోంది. బిజినెస్ ట్రావెల్స్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉత్తమ ప్రథమ శ్రేణి సేవలు అందించిన వారికిచ్చే ఉత్తమ వాణిజ్య ట్రావెల్ అవార్డు దక్కించుకుంది జెట్ ఎయిర్ వేస్. 2006, 2007 సంవత్సరాలకు గానూ ఉత్తమ కార్యక్రమాల ఫ్రెడ్డీ అవార్డులు పొందింది.
2009 లో టఫీ అందించిన భారత్ నుంచి ఉత్తమ ఈస్ట్ బౌండ్ ఎయిర్ లైన్ అవార్డు మరియు ఉత్తమ భారత దేశీయ ఎయిర్ లైన్ అవార్డు. లండన్ లోని బిజినెస్ ట్రావెల్ వారి ఉత్తమ భారతీయ ఎయిర్ లైన్ అవార్డులతో పాటు ఎన్నో దేశీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంది ఈ సంస్థ. విమానయాన రంగంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జర్నీ సాగించిన జెట్ ఎయిర్ వేస్ ఇప్పుడు దివాళా తీసేందుకు రెడీ అయ్యింది. దీంతో వందలాది మంది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి