అంకురాలకు ఆలంబన

తెలంగాణ ప్రభుత్వం ఐటీ పరంగా సపోర్ట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీ - హబ్ ను ఏర్పాటు చేసింది. మహిళలు ఆంట్రప్రెన్యూర్ గా ఎదిగేందుకు కావాల్సిన సహకారం అందిస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా వీ హబ్‌‌ స్టార్టప్​ ఇండియా, డిపార్ట్‌‌మెంట్‌‌ ఫర్ ప్రమోషన్‌‌ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ లతో కలిసి విమెన్‌‌ రైజింగ్ టుగెదర్ ప్రోగ్రామ్‌‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా దేశంలో ఏడాదికి 7,500 మంది విమెన్‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో వింగ్ ప్రోగ్రామ్‌‌ వీ హబ్, కేరళ స్టార్టప్ మిషన్ సహకారంతో నడుస్తుంది. ఈ ప్రోగ్రామ్‌‌ ద్వారా ఇంక్యుబేషన్‌‌ను, ఇన్వెస్టర్లను పొందడంలో విమెన్‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లకు సహాయం అందిస్తారు.

వీటితోపాటు వారి బిజినెస్‌‌కు మద్దతిస్తారు. 2017 లో హైదరాబాద్‌‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ తర్వాత వీ హబ్‌‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుకున్న ఏడాదిన్నర లోనే వీ హబ్‌‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని విమెన్‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లకు సహాయం అందజేస్తోంది. విమెన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు అనేక పాలసీలను తీసుకు వచ్చింది. వీరికి అదనపు రాయితీలను అందించడం, సీడ్‌‌ క్యాపిటల్‌‌ను సమ కూర్చడం వంటివి చేస్తోంది.సామాజిక, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర కీలకమని భావిస్తోంది. ప్రభుత్వమే వీళ్లకు తొలి కస్టమర్‌‌‌‌గా ఉంటుందని కేటీర్ హామీ ఇచ్చారు.

విమెన్‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వీ‌‌ హబ్‌‌ లాంటి సంస్థలను ఏర్పాటు చేసిందని ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ చెప్పారు. మహిళలు పచ్చళ్లు, అప్పడాలు చేయడం వంటి హౌస్ హోల్డ్ బిజినెస్‌‌లనే చేయగలరని సమాజంలో తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. వీ హబ్‌‌ నుంచి వచ్చిన స్టార్టప్ కంపెనీలు, తాను చూసిన ఇతర స్టార్టప్‌‌ల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు. ఈ కంపెనీలు సాంకేతిక అడ్వాన్స్‌‌డ్‌‌ ను అంది పుచ్చుకున్నాయని చెప్పారు. డీపీఐఐటీ సహకారంతో వీ‌‌ హబ్ తెలంగాణలోని విమెన్‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లు వారి గమ్యానికి చేరుకోడానికి, బలమైన కంపెనీని నిర్మించుకోడానికి సహాయ పడుతుందన్నారు.

ఆలోచన పుట్టినప్పటి నుంచి అది విజయవంతమైన ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌గా మారేంత వరకు వీ హబ్, తెలంగాణ విమెన్‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లకు సహాయంగా ఉంటుందని వీ‌‌ హబ్ సీఈఓ దీప్తీ రావుల అన్నారు. దేశంలో 48 శాతం మహిళలున్నా, 90 శాతం స్టార్టప్ కో–ఫౌండర్లు మగవాళ్లేనని తెలిపారు. వీ హబ్ బిగినర్‌‌‌‌, అడ్వాన్స్‌‌డ్ వర్క్ షాప్‌‌లను నిర్వహిస్తుందని, మొదటి వర్క్ షాప్​ జనవరి 22–23 న హైదరాబాద్‌‌లో ప్రారంభ మవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ స్టార్టప్ అవార్డ్స్‌‌ను స్టార్టప్ ఇండియా ప్రారంభించింది. స్టార్టప్ కంపెనీలు, ఇంక్యుబేటర్లు, యాక్సిలేటర్లు ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. వివిధ రంగాలలోని ప్రతి సబ్ సెక్టార్లో ఒక స్టార్టప్ కంపెనీకి 5 లక్షల ప్రెజ్‌‌మనీని ఇవ్వనున్నారు. ఒక ఇంక్యుబేటర్‌‌‌‌కు 15 లక్షలు, ఒక యాక్సిలేటర్‌‌‌‌కు 15 లక్షల ప్రైజ్ మనీని ప్రకటించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!