ధర పలికిన ఆటగాళ్లు వీళ్ళే

ఐపీఎల్ వేలం ఈసారి స్పెషల్ గా కొనసాగింది. అందరూ విస్తు పోయేలా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కమ్మిన్స్ అత్యధికంగా వేలంపాటలో అమ్ముడు పోయాడు. పలువురు బరిలో ఉన్నా ఈసారి మాత్రం ఫ్రాంచైజీలు పెర్ఫార్మెన్స్ ఆధారంగానే తీసుకున్నారు. అయితే కొన్ని చిత్రాలు చోటు చేసుకున్నాయి. అనుకున్న ఆటగాళ్లు ఎంపిక కాలేదు. ఇక ఫ్రాంచైజీల వారీగా చూస్తే ..చెన్నై సూపర్ కింగ్స్ పీయూష్ చావ్లా ను 6.75 కోట్లకు దక్కించుకుంది. 5.5 కోట్లకు శ్యాం కరన్, 2 కోట్లకు హాజల్ వుడ్ , 20 లక్షలకు సాయి కిషోర్ ను తీసుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ హెట్ మైర్ ను 7 కోట్ల 75 లక్షలకు వేలం పాటలో దక్కించుకుంది. స్టొయినిస్‌ 4.8 కోట్లు పలకగా, అలెక్స్ క్యారీ 2.4 కోట్లు, జేసన్‌ రాయ్‌ 1.5 , క్రిస్‌ వోక్స్‌ 1.5 కోట్లు పలికారు.

ఇక మోహిత్‌ శర్మ ను 50 లక్షలకు, తుషార్‌ దేశ్‌పాండేను 20 లక్షలు, లలిత్‌ యాదవ్‌ 20 లక్షలు వేలంలో దక్కించుకుంది. మరో వైపు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అత్యధికంగా మ్యాక్స్‌వెల్‌  ను ఏకంగా 10.75 కోట్లకు చేజిక్కించుకుంది. కాట్రెల్‌ 8.5 కోట్లు, క్రిస్‌ జోర్డాన్‌ 3.0 కోట్లు, రవి బిష్ణోయ్‌ 2.0 కోట్లు, ప్రభు సిమ్రన్‌ సింగ్‌ 55 లక్షలు, దీపక్‌ హుడా 50 లక్షలు, జేమ్స్‌ నీషమ్‌ 50 లక్షలు, తజిందర్‌ ధిల్లాన్‌ 20 లక్షలు, ఇషాన్‌ పోరెల్‌ 20 లక్షలకు అమ్ముడు పోయారు. రికార్డ్ బ్రేక్ చేసిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌. మేనేజ్ మెంట్ మొత్తం 2020 వేలంపాటలో అత్యధికంగా ఫ్యాట్ కమ్మిన్స్ 15.5 కోట్లకు అమ్ముడు పోయాడు.

ఇతడే అధిక రేట్ కు పలికాడు. మోర్గాన్ 5.25 కోట్లు పలుకగా, వరుణ్ చక్రవర్తి 4 కోట్లకు పలికాడు. ఇక టామ్‌ బాంటన్‌ ఒక కోటి, రాహుల్‌ త్రిపాఠి 60 లక్షలు, క్రిస్‌ గ్రీన్‌ , నిఖిల్ శంకర్, ప్రవీణ్ తాంబే, సిద్దార్థ్ తలో 20 లక్షలు చొప్పున వేలంపాటలో దక్కించుకుంది. మరో వైపు ముంబై ఇండియన్స్ కూల్టర్‌ నీల్‌ ను 8 కోట్లకు కొనుక్కుంది. కిర్స్ లీన్ 2 కోట్లు, సౌరభ్ తివారి 50 లక్షలు, దేశ్ ముఖ్ 20 , ప్రిన్స్ బల్వంత్ రాయ్ 20 ,లక్షలు, మొహిసిన్ ఖాన్ ను 20 లక్షలు వెచ్చించి దక్కించుకుంది.

రాజస్థాన్ రాయల్స్ 3 కోట్లకు, జైదవ్ 3 కోట్లు, జైస్వాల్ 2.4 కోట్లు, కార్తీక్ త్యాగి ఒక కోటి 30 లక్షలు, కరన్ ఒక కోటి, ఆందరూ టై 1 కోటి, అనూజ్ రావత్ 80 లక్షలు, డేవిడ్ మిల్లర్ 75 లక్షలు, థామస్ 50 లక్షలు, జోషి , ఆకాష్ సింగ్ లను 20 లక్షల చొప్పున చేజిక్కించుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ..ఈసారి క్రిస్ మోరిస్ ను అత్యధికంగా 10 కోట్లకు దక్కించుకుంది. ఆరోన్ పించ్ ను 4 కోట్ల 40 లక్షలు, కెన్ రిచర్డ్ సన్ ను 4 కోట్లకు , స్టెయిన్ ను 2 కోట్లకు, ఇసురు ఉదానను 50 లక్షలు, షాబాద్ అహ్మద్ , జాషువా ఫిలిప్ , పవన్ దేశ్ పాండే లను ఒక్కొక్కరికి 20 లక్షలు చొప్పున ఎంపిక చేసుకుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి అతి తక్కువకే కొందరిని మాత్రమే ఎంపిక చేసుకుంది. మిచెల్ మార్ష్ ను 2 కోట్లకు, ప్రియం గార్గ్ , విరాట్ సింగ్ లను కోటి 90 లక్షలు చొప్పున దక్కించుకుంది. అలెన్ ను 50 లక్షలు, సందీప్, సమద్, సంజయ్ యాదవ్ లకు ఒకొక్కరిని 20 లక్షల చొప్పున ఎంపిక చేసుకుంది. రెండో ఆటగాడిగా మ్యాక్స్ వెల్ పదిన్నర కోట్లకు అమ్ముడు పోయాడు. ఈ మొత్తం వేలం పాటలో విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా అమ్ముడు పోగా మన ఆటగాళ్లు చాలా మంది మిగిలి పోవడం గమనార్హం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!