విద్యార్థులకు గైడ్ లైన్ - విద్యా హెల్ప్ లైన్ - తెలంగాణ పోర‌ని గెలుపు క‌థ

విద్యా హెల్ప్ లైన్ గురించి ఎవ‌రిని అడిగినా ఠ‌కీమ‌ని చెప్పేస్తారు హైద‌రాబాద్ సిటీలో. ఇదో పేరుకు స్వ‌చ్చంధ సంస్థ‌నే. కానీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా బిట్స్ పిలానీలో చ‌దువుకుని, ఉన్న‌తమైన జాబ్స్‌ను వ‌దిలేసుకుని ..కేవ‌లం స్టూడెంట్స్ బాగు కోసం త‌న జీవితాన్ని అంకితం చేసిన తెలంగాణ కుర్రాడి క‌థ ఇది. వికారాబాద్‌కు చెందిన పుచ్చ‌కాయ‌ల చంద్ర‌శేఖ‌ర్ సాంకేతిక ప‌రంగా మంచి విజ‌న్ ఉన్న యువ‌కుడు. తాను నేర్చుకున్న‌, తాను అనుభ‌వించిన ఇబ్బందుల‌ను భావిత‌రాల‌కు చెందిన పిల్ల‌లకు క‌ల‌గ‌కూడ‌ద‌నే ఉద్ధేశంతో నిర్మాణ్ విద్యా హెల్ప్ లైన్ పేరుతో ఎన్‌జిఓను స్థాపించాడు. అది అంచెలంచెలుగా త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను విస్త‌రించుకుంటూ పోయింది. దాత‌లు, సంస్థ‌లు చంద్ర‌శేఖ‌ర్ అండ్ టీం క‌లిసి చేస్తున్న ప్రోగ్రామ్స్ ను చూసి ఇంప్రెస్ అయ్యారు. 

వారు కూడా తోచిన రీతిలో సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. వారందిస్తున్న చేయూత‌తోనే ఇంకా ముందుకు వెళ్ల‌గ‌లుగుతున్నామ‌ని అంటున్నారు చంద్ర‌శేఖ‌ర్ విన‌మ్రంగా. ఇక్క‌డ కుల‌, మ‌తాల‌కు, వ‌ర్గాల‌కు తావు లేదు. కేవ‌లం ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దువుకుని అంద‌రికంటే టాప్‌లో నిలిచిన వారికి ఆయా కంపెనీల‌కు చెందిన ఉద్యోగులు త‌మ వేత‌నాల్లోంచి కొంత మొత్తాన్ని ఉప‌కార వేత‌నంగా అంద‌జేస్తారు. వారు ఉన్న‌త స్థానాల్లోకి వెళ్లాక‌..తిరిగి త‌మ లాంటి పిల్ల‌ల‌కు స‌హాయం చేయాల‌న్న‌ది విద్యా హెల్ప్ లైన్ కాన్సెప్ట్. ఇది అంద‌రికీ న‌చ్చింది. చంద్ర‌శేఖ‌ర్ తోపాటు చాలా మంది ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో స్వ‌చ్ఛంధంగా పాలు పంచుకుంటున్నారు. ఇక పుచ్చ‌కాయ‌ల గురించి చెప్పాల్సి వ‌స్తే.. ఈ సంస్థ‌కు చంద్ర‌శేఖ‌ర్ సిఇఓగా ఉన్నారు. గ‌త మూడేళ్లుగా ఈ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. జ‌న‌వ‌రి 2014లో నిర్మాణ్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. చాలా ప్రాజెక్టులో ఆయ‌న పాలు పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వ‌చ్చే మాస్ స్టూడెంట్స్‌కు స‌మాన అవ‌కాశాలు ద‌క్కాల‌న్న క‌సితోనే త‌న జాబ్‌ను వ‌దిలేసుకున్నారు. నాణ్య‌వంత‌మైన విద్య అంద‌రికి అందాల‌న్న ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నారు.

ఇండియాలో పేరొందిన జేపీ మోర్గాన్ లో జాబ్‌ను వ‌దులుకున్న చంద్ర‌శేఖ‌ర్ సోష‌ల్ స‌ర్వీస్ సెక్టార్‌ను ఎంపిక చేసుకున్నాడు. ముంబయిలో ఉద్యోగం మానేశాక‌..త‌న స్వంత రాష్ట్రంలోని హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. ఇక్క‌డ నిర్మాణ్ ఆర్గ‌నైజేష‌న్‌లో ఫుల్ టైమ‌ర్‌గా ఉన్నాడు. కేవ‌లం న‌లుగురితో క‌లిసి విద్యా హెల్ప్ లైన్ అనే సంస్థ‌ను స్థాపించాడు. ప్ర‌తి ఏటా ఈ సంస్థ ద్వారా ల‌క్ష మందికి పైగా విద్యార్థులు సేవ‌లు పొందుతున్నారు. ఇదంతా చంద్ర‌శేఖ‌ర్ చ‌ల‌వ వ‌ల్ల‌నే సాధ్య‌మైంది. వీరి సర్వీసెస్ డిఫ‌రెంట్‌గా వుంటాయి. విద్యార్థుల్లో ఎలాంటి ప్ర‌తిభ వుందో వెలికి తీస్తారు. ప‌రీక్ష‌లు పెడ‌తారు. వ‌డ‌పోస్తారు. మెరిక‌ల్లాంటి వారిని ఎంపిక చేసుకుంటారు. మిగ‌తా వారిని డిస్క‌రేజ్ చేయ‌రు. మ‌రింత ముందుకు వెళ్లేలా ఎంక‌రేజ్ చేస్తారు. మెంటార్స్, ట్రైన‌ర్స్ , ఎక్స్‌ప‌ర్ట్స్‌తో స్పీచెస్ వుంటాయి. ఎక్క‌డ పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలో విద్యార్థుల‌కు నేర్పిస్తారు. రాను పోను ఛార్జీలు చెల్లించ‌డ‌మే కాకుండా భోజ‌నాలు, టిఫిన్ ఖ‌ర్చులు పే చేస్తారు.

 రాష్ట్ర స్థాయిలో, జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిల‌లో ఎన్నో ప్రాజెక్టుల‌ను రూపొందించి..ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు చంద్ర‌శేఖ‌ర్. న‌ల్ల‌గొండ‌కు చెందిన న‌గేష్ మేనేజ‌ర్‌గా, ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్‌గా ఉన్నారు. బిట్స్ పిలానికి చెందిన మ‌యూర్ ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. నిర్మాణ్, విద్యా హెల్ఫ్ లైన్ ప్రాజెక్టుల‌కు కో ఫౌండ‌ర్‌గా ఉన్నారు. నిరుద్యోగుల‌కు నిర్మాణ్ యూత్ ఎంప్లాయిమెంట్ ప్రాజెక్టు ద్వారా ఉపాధి క‌ల్పించేలా చూస్తున్నారు. ఏపీలోని రాజీవ్ యువ కిర‌ణాలు ప్రాజెక్టులో స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ వ‌దిలేసుకుని ఈ సంస్థ‌లో చేరాడు. ఐబీలో ఐదేళ్ల పాటు ప‌నిచేశాడు. యువ వార‌ధి పేరుతో ఎన్‌జిఓను ఏర్పాటు చేశాడు.

ఈ సంస్థ‌లో మ‌రో వ్య‌క్తి విక్ర‌మ్. ఇత‌ను కూడా ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఐఐటీ గౌహ‌తిలో చ‌దివారు. విహెచ్ ఎల్‌లో ఆర్కిటెక్ట్ ఇంజ‌నీర్‌గా ఉన్నారు. ఐబీఎంలో ప‌నిచేశాడు. సంస్థ‌కు త‌న కంట్రిబ్యూష‌న్ అంద‌జేస్తున్నారు. విద్యా హెల్ప్ లైన్ ద్వారా సేవ చేస్తున్నారు. ఫుల్ టైమ్ మెంబ‌ర్స్ గా ..శ్రీ‌హ‌రి సీనియ‌ర్ కౌన్సిల‌ర్‌గా, రామ్ శ్రీ‌నివాస్ అక‌డమిక్ కౌన్సిల‌ర్‌గా, హేమ‌, వెంక‌ట్‌, ప్రేమ్ తేజ , సోనిక‌, స్ర‌వంతి కౌన్సిల‌ర్లుగా ప‌నిచేస్తున్నారు. సిటీ క‌మ్ ఎక్స్‌పాన్ష‌న్ కోఆర్డినేట‌ర్‌గా శ్ర‌వ‌ణ్‌, గీతా ప్ర‌సాద్ రీసెర్చ్ కోఆర్డినేట‌ర్‌గా, విన‌య్ కుమార్ ఫైనాన్స్ కోఆర్డినేట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. వీరితో పాటు ప‌లువురు ఇత‌ర రాష్ట్రాల్లోని కేంద్రాల‌లో సేవ‌లందిస్తున్నారు. ఒడిస్సాలో విలేజ్ నాలెడ్జ్ సెంట‌ర్ల‌ను ప్రారంభించారు. 

2,50,000 మందికి విద్యాప‌రంగా అసిస్టెన్స్ అందించారు. 2015లో విద్యా హెల్ప్ లైన్ ప‌రంగా పుర‌స్కారాల‌ను అంద‌జేసింది. ఈ దేశంలో ఇంకా చ‌దువుకు నోచుకోని వారు ఎంద‌రో ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన పిల్ల‌ల‌కు అపారమైన అవ‌కాశాలు అందిపుచ్చుకునేలా చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. ఆ దిశ‌లోనే విద్యా హెల్ప్ లైన్ వారికి అండ‌గా నిలుస్తోంది. నిర్మాణ్ కూడా ఇందులో భాగ‌మే. ఉద్యోగం అవ‌స‌ర‌మే..కానీ ప‌ది మందికి సేవ చేయ‌డంలో ఉన్న ఆనందం ఇంకెందులోను దొర‌క‌దంటున్నారు ఈ తెలంగాణ పోర‌గాడు..చంద్ర‌శేఖ‌ర్. స‌మున్న‌త ఆశ‌యం. స‌త్ సంక‌ల్పం క‌లిగిన ఈ కుర్రాడు..మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాలి. వేలాది పిల్ల‌ల్లో వెలుగులు పూయించాలి. 

కామెంట్‌లు