అట్లి నోట తారక్ మాట


అట్లి గుర్తున్నాడా. ఇండియన్ సినిమా సెక్టార్ లో ఇప్పుడు అతడో సంచలనం. ఏకంగా తమిళ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఒకే ఒక్క పేరు అదే అట్లి. నటి ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ కుర్రాడు ఏది చేసినా అదో సంచలనమే. ఇప్పటికే పాన్ ఇండియా డైరెక్టర్స్ లోకి మనోడు కూడా చేరి పోయాడు. ప్రముఖ డైరెక్టర్ శంకర్ కు అట్లి ప్రియ శిష్యుడు. కేవలం మూడు సినిమాలు మాత్రమే తీశాడు. బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి ఈ సినిమాలు. దీంతో మనోడు మోస్ట్ పాపులర్ గా మారి పోయాడు. తాజాగా నటుడు విజయ్ తో బిగిల్ పేరుతో సినిమా తీశాడు. దానిని తెలుగులో విజిల్ గా విడుదల చేశారు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబా కు వచ్చారు డైరెక్టర్ అట్లి. చాలా మంది తమిళ్ నటులతో పాటు తెలుగు, హిందీ నటులు కూడా అట్లీతో సినిమాలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సందర్బంగా అట్లి మాట్లాడుతూ తెలుగులో సినిమా చేయాలని ఉందన్నారు. ఇటీవల జూనియర్ ఎన్ఠీఆర్ తో కలిసి ఓ సినిమా తీయబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ సినిమా గురించి అటు ఎన్టీయార్‌ కాని, ఇటు అట్లీ కాని అధికారికంగా స్పందించ లేదు. ఎన్టీయార్ సినిమా గురించి స్పందించాడు.

తెలుగు సినిమా చేయాలని చాలా రోజుల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నా అని అట్లి చెప్పారు. తమిళంలో నేను చేసిన ప్రతీ సినిమా విడుదల సమయంలో ఎన్టీయార్ నాకు ఫోన్ చేసి అభినందిస్తారు. తారక్ ది చాలా మంచి మనసు. ఆయన కోసమైనా తెలుగు సినిమా చేయాలని కోరుకుంటున్నానని అట్లీ అన్నాడు. మొత్తం మీద అట్లి ..ఎన్ఠీఆర్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందన్న మాట. తారక్ అభిమానులకు ఓ పండుగ లాంటి వార్త కదూ ఇది. 

కామెంట్‌లు